Tuesday, November 10, 2020

Nishtha queries



Read also:

మూడో మాడ్యూల్ లో చాలామంది ఉపాధ్యాయులు వీడియోలు ప్లే కావడం లేదు,  Pdf మిస్సింగ్ సమస్య , కోర్స్ 97% , సర్టిఫికెట్ డౌన్లోడింగ్ సమస్యలకు కొన్ని పద్ధతులు సూచించటం జరిగింది.    

1)ఆప్ update చేయటం.

2)Settings > Apps > Diksha >  Clear  Cache 

3)ఓపెన్ కానటువంటి సెగ్మెంట్ లో ఉన్న Download button పక్కనే ఉన్న Delete button (Red Colour) ని ప్రెస్ చేసి మరల content ని డౌన్లోడ్ చేసుకోవటం...   

4) మీరు కోర్సు పూర్తి చేసుకున్న 24 గంటల లోపల ఎప్పుడైనా పర్సంటేజ్ మీటర్ లో  హండ్రెడ్ చూపించవచ్చు.

5) మీరు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ఎప్పుడైనా మీ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవ్వచ్చు.

6) Sign out /Sign in 

ఇక్కడ signout చేసి ఒక్కోసారి మీరు sign in అయ్యేటపుడు మీ password ని worng entry చేస్తున్నారు.  తరువాత ఏదో ఒకటిలే అని మరల కింద ఉన్న గూగుల్ నుంచి sign in అవుతున్నారు.  ఇలా అయితే మీకు Diksha id మారిపోయి మీరు ఇంతకుముందు చేసిన courses ఏమి చూపించవు. 

Userid, Password course పూర్తి అయ్యేవరకు ఎక్కడైనా రాసి జాగ్రత్త పెట్టుకోండి. 

ఎవరైతే పైన చెప్పినట్టు వంటివన్నీ పాటించినా కూడా మాకు ఇంకా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ఏం చేయాలి?  అనేవారి కోసం ఈ సూచనలు.

అటువంటి వారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి 

1) పెండింగ్‌లో ఉన్న వీడియోలను PC కానీ,  Laptop లో  కానీ  పూర్తి చేయడం.

దాని కోసం http://Diksha.gov.in సైట్ కి వెళ్లి 

  • Explore Diksha క్లిక్ చేసి 
  • Sign in అవ్వండి. 
  • Phone number
  • Password
  • Submit

మీరు లోపలికి లాగిన్ అయ్యాక Pending open చేసి మిగిలినవి అన్నీ పూర్తి చేస్తే 100% అవుతుంది.

2) ఇప్పటికే పనిని పూర్తి చేసిన మరొకరి మొబైల్‌లో పెండింగ్ పనిని పూర్తి చేయడం. 

దీనికి గాను మీకు ఫోన్ ఇచ్చే వ్యక్తి signout చేసి ఇవ్వాలి. అపుడు మీ user id, password ఉపయోగించి మీ కోర్స్ పెండింగ్ పూర్తి చేసుకోవచ్చు. మీ పని పూర్తి అయ్యాక మీరు signout చేయండి. 

కొన్ని Redmi, Samsung Old mobiles ఈ ఆప్ లో ఉన్న కంటెంట్ ని చూపించలేకపోతున్నాయి. కాబట్టి మిస్సింగ్ pdf అని వస్తుంది. అలాగే వీడియోస్  కూడా ప్లే చేయలేకపోతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కాలయాపన చేయకుండా వెంటనే మీ PC లో కానీ, Laptop లో గాని మీకు తెలిసిన వ్యక్తి యొక్క మొబైల్ లో గాని కోర్సులు పూర్తిచేయండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :