Tuesday, November 17, 2020

Blocked vacancies గురించి చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు



Read also:

1)Vacancies ఎందుకు block చేస్తున్నారు

జ: జిల్లా వ్యాప్తంగా కంపల్సరీ బదిలీ కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య కంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.block చేయక పోయినా ఇప్పుడు block చేసినన్ని ఖాళీలు కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోతాయి.అయితే కొన్ని మండలాలు పూర్తిగా fill అయి కొన్ని మండలాల్లో భారీ స్థాయిలో ఖాళీలు మివిలిపోతాయి.దానిని నివారించడానికి తీసుకున్న ముందస్తు ప్రాణాళికయే ఈ blocking. దీనివల్ల teacher less school ఏదీ ఉండదు.

2.ప్రశ్న: ఈ blocking vacancies ఒక్కో మండలంలో ఒక్కో సంఖ్యలో ఎందుకు ఉన్నాయి?ప్రాతిపదిక ఏమిటి?

జ: మండలంలో cadre strength అనగా total sanctioned posts బట్టి అన్ని మండలాలకు సమాన %లో block చేయడం జరిగింది.*దీనివల్ల అన్ని మండలాలకు సమ న్యాయం జరుగుతుంది.

3.ప్రశ్న: Blocked vacancies ని ఎలా గుర్తించారు?ఆ పాఠశాలల ఖాళీలనే ఎందుకు block చేశారు?

జ: roll ప్రాతిపదికన తీసుకున్నారు.4th category schools కి roll తక్కువ ఉన్నా అక్కడ కొత్తగా వచ్చిన (20 లోపు roll) రెండో post block చేయలేదు. మిగిలిన single teacher schools కి reaportion ద్వారా వచ్చిన రెండో post లు అన్నీ సుమారుగా block చేయడానికి మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోబడ్డాయి... అంటే వారికి రెండో post వచ్చిందనే సంతోషం ఎంతోసేపు నిలవలేదు.. దీనికి కూడా roll lowest నుండి చూడటం జరిగింది.తరువాత border లో ఉన్నవి ఉదాహరణకు just 90దాటినవి, 120 దాటినవి వీటికి రావాల్సిన post block చేయబడుతుంది.ఇలా వీలైనంత వరకూ పాఠశాలలన్నీ బదిలీల అనంతరం నిర్వహించ గలిగే విధముగా ఈ process చేయడం జరిగింది.

4.ప్రశ్న:కొన్ని మండలాల్లో నికరంగా చూపించిన ఖాళీల సంఖ్య కంటే block చేసినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కారణం?

జ: ఆ మండలాల్లో clear vacancies, 8year vacancies తక్కువగా ఉండటం,  block చేయడం అనేది మొత్తం sanctioned posts లో % తీసుకొని చేయడం వల్ల ఈ తేడా కనిపిస్తుంది.

5.ప్రశ్న: మరి ఈ block చేసిన post లు ఎప్పుడు, ఎలా fill చేస్తారు?

జ: బహుశా DSC ద్వారా FILL చేయవచ్చు.

Transfers Submit Application for Deleted Applicants Option Enabled Check Now

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :