Friday, November 27, 2020

bank holidays in December



Read also:

దేశంలోని ప‌బ్లిక్‌, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ప్ర‌తి ఆదివారం,  ప్ర‌తి నెల‌లోని రెండో, నాల్గ‌వ శ‌నివారాలు ప‌నిచేయ‌వు. ఈ సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇదే కాకుండా పండుగ‌లు, ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌త్యేక రోజులకు కూడా సెల‌వులు ఉంటాయి. ఏడాది చివ‌ర‌కు వ‌చ్చేశాం. ఈ నెల‌లో వేరే రాష్ట్రాల్లో కొన్ని ప్ర‌త్యేక రోజుల‌కు సెల‌వులు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో డిసెంబ‌రు 25వ తేదీ క్రిస్‌మ‌స్ త‌ప్ప వేరే ప‌ర్వ‌దినాలు లేవు. 

ఓసారి డిసెంబ‌ర్ నెల‌లో బ్యాంకు సెల‌వుల గురించి ముందే తెలుసుకుంటే, అందుకు త‌గ్గ‌ట్లుగా మ‌న ప్ర‌ణాళిక‌లు మార్చుకోవ‌చ్చు. 

ఈ తేదీల్లో బ్యాంకులు ప‌నిచేయ‌వు

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల‌కు డిసెంబ‌రు నెల‌లో ఏయే రోజుల్లో సెల‌వులు ఉంటాయో ఓసారి చూద్దాం రండి. 

డిసెంబరు నెలలో రెండో, నాల్గవ శనివారాలు 12, 26వ తేదీల్లో బ్యాంకు సెలవులు. 

క్రైస్త‌వులకు పెద్ద పండుగ క్రిస్‌మ‌స్ ఈ నెల డిసెంబ‌రు 25వ తేదీన నిర్వ‌హించుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ నెల 25వ తేదీ శుక్ర‌వారం వ‌స్తోంది. బ్యాంకు ఉద్యోగుల‌కు ఇది క‌లిసొచ్చే అంశమే.

26వ తేదీ నాల్గ‌వ శ‌నివారం కావ‌డంతో బ్యాంకు సెల‌వు ఉంటుంది. ఆ త‌రువాత ఆదివారం కూడా సెల‌వే. వ‌రుస‌గా మూడు రోజులు ఉద్యోగుల‌కు సెల‌వు దొరుకుతుంది. 

డిసెంబ‌రు నెల‌లో మొత్తం ఏడు రోజులు బ్యాంకు సెల‌వులు ఉండ‌నున్నాయి.

ఏయే తేదీల్లో సెల‌వులంటే

  • డిసెంబ‌రు 6   ఆదివారం
  • డిసెంబ‌రు 12 శనివారం
  • డిసెంబ‌రు 13 ఆదివారం
  • డిసెంబ‌రు 20 ఆదివారం
  • డిసెంబ‌రు 25 శుక్రవారం (క్రిస్ మస్)
  • డిసెంబ‌రు 26 శనివారం
  • డిసెంబ‌రు 27 ఆదివారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :