Thursday, November 12, 2020

AP New Ration Rules



Read also:

  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శకంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. 
  • జనవరి 1 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు వాళ్లే నేరుగా వాహనాల ద్వారా సరుకులను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.
  • 5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్నవారి అర్హతను బట్టి పంపిణీ చేస్తారు. 
  • ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి నేరుగా సరుకులు రేషణ్ దుకాణాలకు వస్తాయి.
  • అక్కడి నుంచి సరుకులు తీసుకుని తమ పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు అందజేస్తారు. 
  • 2021 జనవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే ప్రతి ఇంటికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. సరుకులు అందజేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఆ ఓటీపీని వాలంటీర్లు తమ సర్వర్‌లో నమోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి సరుకులు చేరినట్లు లెక్క.
  • దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు మరోవైపు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. 
  • ఇకపైదేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
  • సెప్టెంబరు 1 నుంచి 68.8 కోట్ల మందిని నేషనల్ పోర్లబిలిటీ కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు. వీరిందరికి ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆమె అన్నారు.
  • వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిన రాష్ట్రాలు:

ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిమ్, మిజోరాం, తెలంగాణ, కేరళ, పంజాబ్, త్రిపుర, గోవా, హిమాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :