Thursday, November 12, 2020

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్



Read also:

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్. CPS విషయం పై సమీక్ష వివరాలు ఇవే..

ఏపీలో కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీపీఎస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని, వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు.

వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు.

వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు.అనంతరం కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

AP Teachers Transfers 2020-అప్లికేషన్ సబ్మిట్ చేయు విధానము-వీడియో పూర్తి వివరాలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :