Friday, November 27, 2020

AP Cabinet Meeting details



Read also:

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సహా అనేక అంశాలపై నేడు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది.

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చింనున్నారు. ఈనెల 30 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యాయి. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేటి మంత్రివర్గ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని.. సభలో ఏం చర్చించాలన్న దానిపైనా కేబినెట్‌లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం, హైకోర్టులో కేసు విచారణపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు. నివర్‌ తుఫాను, వరద నష్టంపైనా కేబినెట్‌ చర్చించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నివార్‌ తుపాను కారణంగా జరిగిన నష్టం, వరదలు, తక్షణం అందించే సాయంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏపీలో కరోనా కేసుల నమోదు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. శీతాకాలంలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం దృష్టి సారిస్తుంది. సెకండ్‌వేవ్‌ కూడా వచ్చే ప్రమాదముండడంతో…. వైరస్‌ కట్టడి చర్యలపై చర్చించనుంది. పాఠశాలల్లో వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, మరింత పడక్బంధీంగా అమలు చేయాల్సిన అంశాలపై మంత్రులు చర్చించనున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు దగ్గర వైఎస్‌ఆర్‌ వంద అడుగుల విగ్రహ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశముంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అంశం సైతం కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలుపైనా మంత్రిమండలిలో చర్చ జరుగనుంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం విజయవతంపై కేబినెట్‌ చర్చించనున్నారు. కోర్టు కేసులులేని అన్ని చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ క్రిస్మస్‌ రోజున ప్రభుత్వం చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా చర్చ జరుగనుంది. ఈ అంశాలపై సీఎం జగన్ మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :