Thursday, November 26, 2020

EPFO WhatsApp Services



Read also:

EPFO WhatsApp Services

ఈపీఎఫ్ఓ ఇటీవల వాట్సప్‌లో హెల్ప్‌లైన్ సర్వీసెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO చందాదారులకు శుభవార్తను తెలిపింది. వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో సరికొత్త వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. చందాదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే వెబ్ ఆధారిత ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా సేవలను అందిస్తుండటం గమనార్హం. దీంతో పాటు 24 గంటల పాటు సేవలు అందించే కాల్ సెంటర్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీనితో ఇకపై చందాదారులు ఈపీఎఫ్ఓ సేవలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. తద్వారా వారి ఫిర్యాదుకు పరిష్కారం లేదా మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ హోమ్‌పేజీలో ప్రాంతీయ కార్యాయాల వారీగా వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్లను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవను ఇలా ఉపయోగించుకోండి

మీ ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన ఫిర్యాదును వాట్సాప్ ద్వారా పరిష్కరించడానికి, మీరు మొదట మీ బ్రాంచ్ ఆఫీస్‌ను తెలుసుకోండి. వివిధ బ్రాంచ్ ఆఫీసులకు వేర్వేరు వాట్సాప్ హెల్ప్‌లైన్‌ నంబర్లు ఉంటాయని గమనించండి. వాట్సాప్ హెల్ప్లైన్ సేవలను అందిపుచ్చుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

Step1: www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.

Step2: 'సేవలు' టాబ్ కింద, 'యజమానుల కోసం' అనే ఆప్షన్ కన్పిస్తుంది దాన్ని ఎంచుకోండి.

Step3: తర్వాత మీ స్క్రీన్‌పై క్రొత్త వెబ్‌పేజీ తెరవబడుతుంది. 'సేవలు' టాబ్ కింద ఉండే 'ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్' ఆప్షన్‌ను ఎంచుకోండి.

Step4: స్క్రీన్‌పై కొత్త వెబ్‌పేజీ తెరవబడుతుంది. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పేరు లేదా ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ (7 అంకెలు మాత్రమే)ను నమోదు చేసి సంస్థ వివరాలను సెర్చ్ చేయవచ్చు. ఒకవేళ మీ సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ మీకు గుర్తుకు లేకపోయినా సరే మీరు కేవలం సంస్థ పేరు ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు. తద్వారా మీ సంస్థకు చెందిన ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, ఎస్టాబ్లిష్మెంట్ స్టేటస్, EPFO కార్యాలయం పేరు, EPFO కార్యాలయం చిరునామా మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు.

ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై వచ్చిన ఫిర్యాదులను ఈపిఎఫ్‌ఓ ఎలాగైతే పరిష్కరిస్తుందో అదే విధంగా వాట్సాప్పై వచ్చే ఫిర్యాదులను కూడా అదే రూపంలో పరిష్కరిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :