Tuesday, November 17, 2020

ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త-జనవరిలో 6500 పోలీసు ఉద్యోగాల భర్తీ



Read also:

ఏపీలో నిరుద్యోగ యువతకు హోం మంత్రి సుచరిత శుభవార్త చెప్పారు. సుమారు 6,500 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామన్నారు. నాలుగు దశల్లో మొత్తం 6500 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని.. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి అవగాహన కల్పించామని, పోలీస్ సేవా యాప్‌ కూడా తీసుకొచ్చామన్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ద్వారా చాలా మంది నిరుద్యోగులకు మంచి జరుగుతుందన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :