Monday, October 26, 2020

SBI Home Loans



Read also:

  • ఇల్లు కట్టాలనుకుంటున్నారా. అందుకోసం రుణం కావాలా. ఫెస్టివల్ ఆఫర్లతో SBI హోమ్ లోన్స్ ఇస్తోంది. రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అంటోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
  • SBI Home Loans: పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు అంటారు. ఎందుకంటే. ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ రెండూ అత్యంత ముఖ్యమైన ఘట్టాలు. ప్రధానంగా ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఉంటే. ఆ సంతృప్తే వేరు. అయితే. ఇల్లు కట్టేందుకు అందరికీ డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి వారికి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). హోమ్ లోన్స్ రూపంలో సాయపడుతోంది. తాజాగా దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది.
  • ఇప్పుడు మీరు SBI ద్వారా హోమ్ లోన్స్ పొందాలనుకుంటే. మీకు వడ్డీ రేటు అతి తక్కువగా 6.90 శాతం నుంచి మొదలవుతుంది. అంతేకాదు. ఫెస్టివల్ సందర్భంగా ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం పూర్తిగా రద్దు చేసింది. రహస్య ఛార్జీలు, ఇతర నిర్వహణ ఛార్జీలు కూడా ఉండవని SBI తెలిపింది.
  • మీరు పొందే హోమ్‌లోన్‌పై 25bps వరకూ. ఫెస్టివల్ సీజన్ వడ్డీ రేటు తగ్గింపు వర్తిస్తుంది. అలాగే. మీరు యోనో యాప్ (YONO APP) ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకుంటే. మరింత అదనపు తగ్గింపు వర్తిస్తుందని SBI తెలిపింది.
  • ఇవే కాదు. హోమ్ లోన్, హోమ్ టాప్ అప్ లోన్ సదుపాయాలు. ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో కూడా లభిస్తున్నాయి. తద్వారా. మీరు మిగులు నిధులను సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే. ముందస్తు పేమెంట్ పెనాల్టీలు లేవు. ఎవరైనా ముందుగానే లోన్ చెల్లిస్త. వడ్డీ రేటు భారం కూడా తగ్గుతుంది.
  • ఇప్పుడు ఎస్బీఐ. హోమ్ లోన్స్‌ను రెపోతో లింకైన లెండింగ్ రేటుకి లింక్ చేసింది. అందువల్ల హోమ్ లోన్స్ తీసుకునేవారికి ప్రయోజనం కలగనుంది. అలాగే. PMAY-CLSS స్కీమ్ కింద. రూ.2.67 లక్షల వరకూ వడ్డీ సబ్సిడీ ఇస్తోంది ఈ బ్యాంగ్.
  • ఎస్బీఐ బ్రిడ్జ్ హోమ్ లోన్ ద్వారా. కొత్త ఇంటిని కొనుక్కోవచ్చు. ఎవరైనా సరే ఇప్పుడు. ఇన్‌స్టా హోమ్ టాప్ అప్ లోన్ పొందే అవకాశం ఉందో లేదో ఎస్బీఐకి చెందిన యోనో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఇలా ఈసారి దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ఇంటి కలను నెరవేర్చుకోమంటోంది ఎస్బీఐ. తక్కువ వడ్డీరేటుతోపాటూ. అదనపు ఆఫర్లతో అదిరే అవకాశాన్ని అందిపుచ్చుకోమంటోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :