Wednesday, October 28, 2020

No schools until November 30



Read also:

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుంటే. చాలా రాష్ట్రాలు స్కూళ్లను తెరిచేందుకు రెడీ అవుతున్నాయి. వాటికి బ్రేక్ వేస్తూ. కేంద్రం ప్రత్యేక ఆదేశం జారీ చేసింది.

మన రాష్ట్రాలతోపాటూ. దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. అందువల్ల ఇప్పటికే చాలా వరకూ సడలింపులు ఇచ్చేసినా. స్కూల్స్ ఎప్పుడు తెరవాలనే అంశం అన్ని రాష్ట్రాలకూ ప్రశ్నగానే ఉంది. కొన్ని రాష్ట్రాలు. ఫలానా తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించాయి కూడా. ఐతే. అన్‌లాక్ 5 మార్గదర్శకాలు. మరో నెలపాటూ అంటే. నవంబర్‌లోనూ కొనసాగుతాయన్న కేంద్రం. స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ జారీ చేసింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. కేంద్ర అధికారులు మరో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అందువల్లే స్కూల్స్ తెరిచే విషయంలో కేంద్రం లోతుగా ఆలోచిస్తోంది.

నవంబర్ 30 వరకూ నో స్కూల్స్

కొత్త ఆదేశాన్ని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 10 (2)(1)లో అధికారాలను ఉపయోగించుకుంటూ. ఈ ఆదేశం జారీ చేసింది. దీని ప్రకారం. నవంబర్ 30 వరకూ స్కూళ్లు తెరవడానికి వీల్లేదు.

కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశం.

School_ReOpen
తల్లిదండ్రులకే ఇష్టం లేదు:

నిజానికి రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు తెరుద్దామన్నా. తమ పిల్లల్ని పంపడానికి దాదాపు 80 శాతం మంది తల్లిదండ్రులు ఆసక్తిగా లేరు. ఎందుకంటే. కరోనా సోకదని గ్యారెంటీ ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల్ని ఇళ్లలోనే ఉంచుకొని చదివించుకుంటాం తప్ప. స్కూలుకు పంపే ప్రసక్తే లేదంటున్నారు. వైరస్‌కి వ్యాక్సిన్ వేసేంతవరకూ అదే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. అటు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తల్లిదండ్రులను ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది. అందువల్లే ఇప్పుడు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి.

ఇండియాలో కరోనా

ఇండియాలో కొత్తగా 36,470 మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 79,46,429కి చేరింది. దేశంలో కొత్తగా 488 మంది చనిపోవడంతో. మొత్తం మరణాల సంఖ్య 1,19,502కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతం ఉండగా. ప్రపంచ దేశాల్లో అది 2.66 శాతంగా ఉంది. తాజాగా 63,842 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,01,070కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 6,25,857 ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :