Wednesday, October 28, 2020

Flipkart Big Diwali Sale



Read also:

రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ 80 శాతం వరకు డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఈసారి సేల్‌లో వేటిపై ఎంత డిస్కౌంట్ ఉంటుందో తెలుసుకోండి.

1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏమీ కొనలేదని ఫీలవుతున్నారా? మంచి డిస్కౌంట్స్ మిస్ అయ్యామని అనుకుంటున్నారా? బీ రెడీ. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ జరగబోతోంది. దసరా సేల్ తర్వాత అతిపెద్ద దివాళీ సేల్ ఇది. ఏకంగా వారం రోజుల పాటు ఆఫర్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.

2. అక్టోబర్ 17 నుంచి 21 వరకు 6 రోజుల పాటు బిగ్ బిలియన్ డేస్ సేల్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ దివాళీ సేల్ మాత్రం ఏకంగా ఏడు రోజులు జరగనుంది. అక్టోబర్ 29న మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే సేల్ నవంబర్ 4న ముగుస్తుంది.

3. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దసరా స్పెషల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది. దసరా స్పెషల్ సేల్ ముగిసిన మరుసటి రోజే భారీ డిస్కౌంట్స్‌తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు 12 గంటల ముందే అంటే అక్టోబర్ 28 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సేల్ మొదలవుతుంది.

4. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో డిస్కౌంట్స్ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తో ఒప్పందం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్, బిగ్ దివాళీ సేల్‌కు యాక్సిస్ బ్యాంకుతో డీల్ కుదుర్చుకుంది.

5. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌‌సర్వ్ కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది.

6. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఆఫర్స్ విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. రూ.54,990 విలువైన ఎల్‌జీ జీ8ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,990 ధరకే కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, సాంసంగ్ గెలాక్సీ ఎస్20+, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో సీ3, రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ ఉంటాయి.

7. ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్ కొనొచ్చు. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు, ఫ్యాషన్ వేర్‌పై 50 నుంచి 80 శాతం వరకు, ఫర్నీచర్, మ్యాట్రెసెస్‌పై 75 శాతం వరకు ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

8. వీటితో పాటు ప్రతీరోజు అర్ధరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 8 గంటలకు ధమాకా డీల్స్, అదనంగా 20 శాతం తగ్గింపుతో మహా డ్రాప్, అర్ధరాత్రి 2 గంటల వరకు రష్ హవర్స్ లాంటి స్పెషల్ డీల్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో 3 కోట్లకు పైగా ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :