Thursday, October 29, 2020

AP Local Body Elections



Read also:

అక్టోబర్, నవంబర్‌లో పండుగలు ఉండటంతో కరోనా వ్యాప్తి పెరుగుతుందని అధికారులు వివరించారు. జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసిందని అధికారులు తెలిపారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్పష్టత ఇచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో... సీఎస్‌ సాహ్ని ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ అభిప్రాయాన్ని ఆయనకు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు తెలియజేశారు. కరోనా కేసులు తగ్గినా సెకండ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలను ఎస్‌ఈసీ ముందు ప్రస్తావించారు. విదేశాల్లో సెకండ్ వేవ్, పెరుగుతున్న కేసులను ఎస్‌ఈసీకి అధికారులు వివరించారు. బీహార్‌ ఎన్నికలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు నిర్వహించిన అంశంపై భేటీలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఉన్న పిల్‌ని ఈ భేటీలో ఎస్‌ఈసీ ప్రస్తావించారు.

అక్టోబర్, నవంబర్‌లో పండుగలు ఉండటంతో కరోనా వ్యాప్తి పెరుగుతుందని అధికారులు వివరించారు. జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసిందని అధికారులు తెలిపారు. కరోనా పరిస్థితిపై వారానికోసారి నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖకు ఎస్‌ఈసీ ఆదేశించింది. అంతకుముందు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై తమ అభిప్రాయం చెప్పాలని వివిధ పార్టీలను ఎస్ఈసీ కోరింది. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ హాజరయ్యాయని, జనసేన, జనతాదళ్ సెక్యులర్ లేఖ ద్వారా అభిప్రాయం చెప్పాయి. 6 రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలను తెలుపలేదని, సంప్రదింపుల ప్రక్రియకు హాజరుకావడం లేదని వైసీపీ నేతలు తెలిపారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :