Tuesday, October 27, 2020

Delete the below apps infected by virus



Read also:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. మీ స్మార్ట్‌ఫోన్‌లో డేంజరస్ యాప్స్ ఉన్నాయేమో ఓసారి చూసుకోండి. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉండే యాప్స్ అన్నీ మీకు ఉపయోగపడేవికావు. మీ స్మార్ట్‌ఫోన్ పనితీరుకు మంచివి కూడా కావు. గూగుల్ ప్లేస్టోర్‌లో డేంజరస్ యాప్స్ చాలా ఉంటాయి. అలాంటివి మీరు డౌన్‌లోడ్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు, గూగుల్ రీసెర్చర్స్ ఇలాంటి యాప్స్ గుర్తించి యూజర్లను అలర్ట్ చేస్తూ ఉంటారు. మాల్‌వేర్, యాడ్‌వేర్ ఉన్న యాప్స్‌ని గుర్తించి జాబితా రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటిని యూజర్లు డిలిట్ చేయడం మంచిది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ హిడెన్ యాడ్స్ మాల్‌వేర్ ఉన్న 21 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించింది. వాటిలో ఎక్కువగా గేమింగ్ యాప్స్ ఉన్నాయి. వీటితో యూజర్లకు ప్రమాదం. గేమింగ్, వర్చువల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండని అని ఊరించి యూజర్లను దోచేస్తుంటాయి ఈ యాప్స్. ఈ 21 యాప్స్‌లో 19 యాప్స్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ యాప్స్‌ని 80 లక్షలసార్లు డౌన్‌లోడ్ చేశారని అంచనా. ఆ 21 డేంజరస్ యాప్స్ జాబితా ఏదో తెలుసుకొని వాటిని మీరు వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డిలిట్ చేయడం మంచిది.

  • Shoot Them
  • Crush Car
  • Rolling Scroll
  • Helicopter Attack - NEWAssassin Legend - 2020 NEW
  • Helicopter Shoot
  • Rugby Pass
  • Flying Skateboard
  • Iron it
  • Shooting Run
  • Plant Monster
  • Find Hidden
  • Find 5 Differences - 2020 NEW
  • Rotate Shape
  • Jump Jump
  • Find the Differences - Puzzle Game
  • Sway Man
  • Desert Against
  • Money Destroyer
  • Cream Trip - NEW
  • Props Rescue

ఈ లిస్ట్‌లో మీరు ఉపయోగిస్తున్న యాప్స్ ఏవైనా ఉంటే వాటిని డిలిట్ చేయండి. ప్లేస్టోర్ నుంచి గూగుల్ ఈ యాప్స్ తొలగించినా అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్లేస్టోర్‌లో ఈ యాప్స్ తీసేసినా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వీటిని అన్ఇన్‌స్టాల్ చేయాలి. సాధారణంగా ఇలాంటి డేంజరస్ యాప్స్ యూజర్లకు అవసరం లేని యాడ్స్ పోస్ట్ చేస్తుంటాయి. డేటా ట్రాక్ చేస్తుంటాయి. అంతేకాదు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తుంటాయి. అందుకే యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్స్, రేటింగ్స్, రివ్యూస్ లాంటివి చెక్ చేయాలి. నమ్మదగ్గ డెవలపర్స్‌కు చెందిన యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసి వాడుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :