Tuesday, October 27, 2020

Childcare leave for men



Read also:

పురుష ప్రభుత్వ ఉద్యోగులూ చిన్నారుల సంరక్షణ సెలవు(చైల్డ్‌కేర్‌ లీవ్‌) తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ తెలిపారు. 

అయితే కేవలం తండ్రి ఉన్నవారికే (సింగిల్‌ మేల్‌ పేరెంట్‌) ఈ వెసులుబాటు వర్తిస్తుందన్నారు. భార్య చనిపోయిన, విడాకులు ఇచ్చిన తండ్రులు తమ బిడ్డల బాధ్యతలను చూసుకోవడానికి ఈ సెలవును ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినా తగినంత ప్రచారం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారుల పాలన కోసం సెలవు తీసుకున్న ఉద్యోగులు సంబంధిత అధికారి ముందస్తు అనుమతితో తాను పనిచేస్తున్న కేంద్రాన్ని విడిచిపెట్టి పోవచ్చన్నారు. ఈ సెలవులో ఉన్నప్పటికీ ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 

చిన్నారుల పాలనా సెలవులు తీసుకున్న వారికి తొలి 365 రోజుల్లో 100% జీతం వస్తుందని, తదుపరి 365 రోజుల్లో 80% జీతం వస్తుందని పేర్కొన్నారు. పిల్లల 22 ఏళ్ల వయసు వరకే చిన్నారుల పాలనా సెలవును తీసుకోవాలన్న నిబంధనను దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

  • కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
  • పూర్తి జీతంతో తొలి 365 రోజులు సెలవులు
  • 80 శాతం వేతనంతో మరో 365 రోజులు లీవు.
  • కేంద్రప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది.
  • కేంద్రప్రభుత్వ పురుష ఉద్యోగులకు కూడా ఇక నుంచి శిశు సంరక్షణ సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రకటించారు.
  • పెండ్లి కానివారు, పెండ్లి అయ్యి భార్య చనిపోయినవారు, విడాకులు తీసుకున్నవారు.సింగిల్‌ పేరెంట్‌గా తమ బిడ్డల ఆలనాపాలనా తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఉన్నవారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.
  • దీని ప్రకారం సింగిల్‌ పేరెంట్‌ పురుష ఉద్యోగులకు మొదటి 365 రోజుల సెలవులకు పూర్తి వేతనం చెల్లిస్తారు.
  • మలిదఫా 365 రోజుల సెలవులకు 80 శాతం వేతనం ఇస్తారు.
  • శిశుసంరక్షణ సెలవులో ఉన్నప్పటికీ సాధారణ సమయంలో ఉద్యోగులకు లభించే పర్యాటక సెలవుల (ఎల్టీసీ) ప్రయోజనాలు కూడా పొందవచ్చని మంత్రి తెలిపారు.
  • మరోవైపు, శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు 22 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే అవసరమైన సమయంలో వారి సంరక్షకులు శిశు సంరక్షణ సెలవులు పెట్టుకొనేందుకు ప్రస్తుతం వీలున్నది.
  • అయితే ఈ వయో పరిమితి నిబంధనను ఎత్తేస్తున్నట్టు కూడా మంత్రి పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :