Wednesday, October 7, 2020

Corona vaccine until the end of this year



Read also:

Corona vaccine until the end of this year-WHO

కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పారు డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోందన్న టెడ్రోస్. ఒక్కసారి టీకా అందుబాటులోకి వచ్చాక వాటి పంపిణీ కోసం దేశాలు సహకరించుకోవాలని చెప్పారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచదేశాలు ఇప్పటికే కోవాక్స్ పేరుతో కూటమి కట్టాయి. ఈ కూటమి ఆధ్వర్యంలో 9 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నాయి. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధానోమ్‌ ఘిబ్రెయేసుస్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో వ్యాక్సిన్‌పై క్లారిటీ ఇచ్చారు.

మనందరికి వ్యాక్సిన్‌ కావాలి.ఈ ఏడాది చివరిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.. అని అన్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం 9 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, వీటిలో ముఖ్యంగా ఫైజర్‌ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌పైనే అందరి ఆశలు ఉన్నాయని అన్నారు. 2021 చివరికల్లా 2 బిలియన్‌ డోసులను డిస్టిబ్యూట్‌ చేయాలన్నదే టార్గెట్‌ అని అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :