Sunday, October 11, 2020

AP Teachers Transfers Guidelines and online web counseling process 2020



Read also:

AP Teachers Transfers Guidelines and online web counseling process-2020

AP Teachers Transfers Guidelines 2020 – Transfers in Online Web Counselling Process
Andhra Pradesh Teachers Transfers 2020 Online Application Submission and Teachers Web Options process is available here. AP Teachers Transfers 2020 Schedule Online application form www.apcfss.in web counseling. AP Teachers Transfers SGT/ SA/ Gr-II HM/ TPT/ HPT school wise Vacancies details, district wise Seniority List Schools Rationalization and Web Counselling details, Dates detailed schedule released by the school education department shortly.
Transfers in Online Web Counselling Process
  • ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను రూపొందిస్తోంది. వాటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వానికి పంపనుంది. గతంలో పెట్టిన పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అవకాశం ఉంది.
  • ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.  
  • కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.
  • మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.

UNDERSTAND WEB-BASED TRANSFERS
  • మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
  • MEO గారు DEO గారికి పంపుతారు.
  • DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
  • ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు మీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
  • ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
  • క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
  • 8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
  • బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
  • ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
  • ఒకసారి confirm చేసిన తర్వాత మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
  • Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
  • కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా  ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
  • ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
  • EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
  • అయితే ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
  • మీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగాను మరియు మీరు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా మీకు place allotment జరుగుతుంది.
  • బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
  • మీకు Allotment place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.
  • ప్రతి cycleలో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా...? అని చెక్ చేస్తుంది.
  • ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్  కోరి ఉంటారో...? వారికే కేటాయిస్తుంది.
  • మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(Presnt school)కేటాయించబడుతుంది.
  • బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
వెబ్ కౌన్సెలింగ్ వలన నష్టాలు:
1.ఎరైసింగ్ ఖాళీలు ఎవరికి వస్తాయి.వాటిని  ఎవరు ఆప్షన్  లో పెట్టరు కదా ?
2.భార్య భర్తలు ఒకే మండలంలో లేదా ఒకే ప్రదేశంలో పనిచేసే అవకాశం లేదు.
3.మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ ను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము.  మన ప్రమేయం లేకుండా ప్లేసును నిర్ణయిస్తున్నారు.
4.లాంగ్ స్టాండింగ్ వారు వేల సంఖ్యలలో ఆప్షన్స్ ఇవ్వవలసి యుండుటవలన కన్ ఫ్యూజ్ కు గురి అవుతున్నారు.
5. మన అవసరాలకు అనుగుణంగా తగిన ప్లేసును సెలెక్ట్ చేసుకోలేము.
6. ఆప్షన్స్ ఎంపికలో  కన్ ఫ్యూజన్ ఉంటుంది.
7.రోజుల తరబడి నెట్ సెంటర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది.
8.ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది ఉపాద్యాయులుకి కంప్యూటర్ నాలెడ్జి లేదు.
9. నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే ఓపికలేక ఆప్షన్స్ ఇవ్వటంలో విసుగు చెంది ఆల్ అని సెలెక్ట్ చేసి 4 కేటగిరి ప్లేస్ లకు వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
10. గతంలో జరిగిన వెబ్ కౌన్సెలింగ్ వలన చాలా మంది ప్లేస్ ల విషయంలో నష్టపోయారు. మనకన్నా వెనుక ర్యాంకు వారికి మంచి ప్లేసులు, ముందున్న వారికి అనుకూలంగా లేని ప్లేసులు వచ్చాయని  చెప్పటం జరిగింది.  అదేమని అడిగితే మీరు ఆప్షన్స్  సరిగా ఇవ్వలేదని అంటున్నారు.
11. మనకి అన్యాయం జరిగితే సరిచేసే అవకాశం లేదు, సరిచేసే వారు లేరు.
12. ప్లేసులు ఎలాట్ మెంట్లో నష్టం జరిగితే ఉపాధ్యాయ తల్లి దండ్రులకు సంబంధించిన మెడికల్ ఎమర్జెన్సీ మరియు పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు.
13. ప్లేసులు ఎలాట్ మెంట్లో  ఫ్రాడ్ జరుగుతుందని చాలా మందికి అనుమానంగా ఉంది.
14. వెబ్ కౌన్సెలింగ్ మొదలైన రోజు నుండి ముగిసే వరకూ అన్నిరోజులు ఉపాధ్యాయులు మానసికి ఆందోళనకు గురి అవుతున్నారు.లాంగ్ స్టాండింగ్ వారు ఆప్షన్స్ ఇవ్వాలంటే కనీసం 4 లేదా 5 రోజులు పైనే పడుతుంది.అదే మామూలు కౌన్సెలింగ్ అయితే కౌన్సెలింగ్ రోజు మాత్రమే  ఆలోచిస్తే సరిపోతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :