Friday, September 25, 2020

SBI introduced new rule for customers



Read also:

మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతాదారులకి అనేక కొత్త స్కీములు ఎప్పుడూ తీసుకువస్తుంది SBI.అయితే తాజాగా కొత్త రూల్ తీసుకువచ్చింది SBI.


అయితే దీని కంటే ముందు ఓ విషయం తెలుసుకోవాలి, తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది.

ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. అక్టోబర్ 1 నుంచి విదేశాలకు పంపించే డబ్బులపై ట్యాక్స్ విధిస్తోంది. ఈ రూల్ స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం.. మన దేశం నుంచి విదేశాలకు డబ్బులు పంపించే వారిపై టీసీఎస్ పడుతుంది. సో దీని వల్ల ఇక్కడనుంచి ఎవరికి అయినా విదేశాలకు నగదు పంపిస్తే ఈ చార్జీలు పడతాయి.

ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) 5 శాతంగా ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైన డబ్బులు పంపే వారికి మాత్రమే టీసీఎస్ వర్తిస్తుంది. అంటే బ్యాంకు ద్వారా దీని కంటే తక్కువ పంపితే ఎలాంటి చార్జీలు పడవు, ఇక పాన్ కార్డు ఉంటే ఐదు శాతం ఇకవేళ పాన్ కార్డ్ లేకపోతే 10 శాతం చార్జ్ పడుతుంది కస్టమర్లకు Here's an important notice for all our SBI Customers. అని తాజాగా ఎస్ బీఐ తెలియచేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :