Friday, September 25, 2020

Vitamin deficiency problems



Read also:

Vitamin deficiency


ఎక్కువగా అలసిపోతున్నారా? కొంచెం పని చేసినా వెంటనే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుందా? రోజు వారీ పనులు చేయడానికి కూడా బద్దకంగా ఉందా? అయితే ఈ ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం లాంటి కారణాల వల్ల త్వరగా అలసట చెందుతారు. దీని వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. విటమిన్ లోపాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే అలసట స్థిరంగా వస్తున్నట్లయితే రోజువారీ పనులు చేసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని సాధారణ విటమిన్ లోపాలను పరిష్కారించాల్సిన అవసరముంది.

Vitamin -B12
ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ ఉత్పత్తికి వీటమిన్ 12 ఎంతో కీలకమైంది. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. ఎప్పుడైతే మీ శరీరానికి విటమిన్ బీ12 లబించదో అప్పుడు మీరు అలసటతో బాధపడే అవకాశముంది. అంతేకాకుండా ఇది బలహీనతకు దారి తీస్తుంది. విటమిన్ బీ12 లోపం శరీరానికి ఆక్సిజన్ ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది అలసట పెరగడానికి మరింత దోహదం చేస్తుంది.

Vitamin -B12 లభించే ఆహార పదార్ధాలు.. చేపలు, మాంసం, గుడ్లు, సాల్మాన్ చేప, బలవర్థకమైన ధాన్యం.

Vitamin-Dవిటమిన్-డీ సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. అందుకే ఇది శరీరానికి ఎంతో కీలకం. ముఖ్యంగా ఎముకలు, దంతాల్లో కాల్షియాన్ని అందిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. విటమిన్-డీ లోపం అలసటకు దారి తీస్తుంది. విటమిన్-డీ లోపం వల్ల శరీరం త్వరగా అలసట చెందుతుందని చాలా సర్వేలు పేర్కొన్నాయి. విటమిన్-డీ ఉత్తమ వనరుల్లో సూర్యరశ్మి కూడా ఒకటి. సూర్యుడు నుంచి తగినంత విటమిన్-డీ శరీరానికి అందుతుంది.

Vitamin -D దొరికే ఆహార పదార్థాలు.సాల్మాన్ చేప, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, పుట్ట గొడుగులు.

Vitamin-C
ప్రస్తుతం కరోనా కాలంలో ఎక్కువ మంది విన్న పేరు విటమిన్-సీ. ఎందుకంటే విటమిన్-సీ.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా చర్మం, వెంట్రుకలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. విటమిన్-సీ లోపం వల్ల ప్రారంభంలో అలసట వస్తుంది. ఎర్ర రక్తకణాల నిర్మాణం, వాటి పనితీరుకు ముఖ్యమైన ఆహారం నుంచి ఐరన్ ను గ్రహించడానికి విటమిన్-సీ ఎంతో ముఖ్యమైంది.

Vitamin -C లభించే ఆహారాలు.సిట్రస్ జాతి పళ్లు, కివి పండు, పైనాపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రి, పుచ్చకాయ, మామిడిలో ఇది పుష్కలంగా దొరుకుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :