Tuesday, September 22, 2020

Line clear to pending SGT posts



Read also:

 పెండింగ్ లో ఉన్న 4 వేల SGT ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి  హైకోర్ట్ లైన్ క్లియర్


త్వరలో ప్రక్రియ మళ్లీ ప్రారంభం.

డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా,ఇంతవరకూ అన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ కారణంగా.కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది.ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయి.

➤డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి.

➤తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.

➤ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్‌) చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

➤ఈరోజు న్యాయస్థానం వీరి వాదనను కొట్టివేసింది.

➤ 2018 సెలెక్టెడ్ అభ్యర్థులకు మరియు ప్రభుత్వ అనుకూల తీర్పు రావటంతో ఇక నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :