Thursday, September 24, 2020

Google pay new features digital token



Read also:

గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. సరికొత్త పేమెంట్ పద్ధతిని ప్రారంభించింది గూగుల్ పే. ప్రస్తుతం ఎస్‌బీఐ, యాక్సిస్ కార్డు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర బ్యాంకు కస్టమర్లు కూడా ఈ కొత్త సర్వీస్ ఉపయోగించొచ్చు. ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.


డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే నుంచి సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పే యాప్ ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల భాగస్వామ్యంతో మరింత సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ఈ సేవను ప్రారంభించడానికి గూగుల్ పేతో చర్చలు జరుపుతున్నారు. ఈ కొత్త విధానంతో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘గూగుల్ పే’ యాప్ ద్వారా మొత్తం మూడు పద్దతుల్లో చెల్లింపులు చేయవచ్చు. కాగా గూగుల్ పే కస్టమర్లు ఇప్పటివరకు యూపీఐ ద్వారా లావాదేవీలను నిర్వహించడానికి మాత్రమే వీలుంది. గూగుల్ 2019 సెప్టెంబర్లో నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో కార్డు చెల్లింపులను టోకనైజ్ చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగానే టోకనైజేషన్ టెక్నిక్ ద్వారా చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత కాలంలో సురక్షితంగా లావాదేవీలు జరపడానికి టోకనైజేషన్ ఫీచర్ కస్టమర్లను మరింత ప్రోత్సహిస్తుంది. వ్యాపారులు తమ లావాదేవీలను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో విస్తరింపజేయడానికి ఇది ఉపయోగపడుతుందని గూగుల్ పే మరియు ఎస్బిఐ- ఇండియా బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ అన్నారు.

కొత్తగా లభించే సేవలు?

ప్రస్తుతం గూగుల్ పే యాప్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఆధారిత చెల్లింపులు మాత్రమే చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోయే ఫీచర్‌తో ఈ యాప్ పూర్తి స్థాయి డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌కి మారుతుంది. అయితే ప్రస్తుతం గూగుల్ పే యూజర్లకు కేవలం యూపీఐ చెల్లింపులు చేసే అవకాశమే ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్తో కస్టమర్ తన కార్డును గూగుల్ పేలో సేవ్ చేసుకోవడం ద్వారా కస్టమర్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశం లభించింది.

టోకనైజేషన్ అంటే ఏమిటి?

టోకనైజేషన్ అనేది కొత్త కార్డు పేమెంట్ టెక్నిక్. ఇది కార్డు చెల్లింపులను సురక్షితంగా చేస్తుంది. సాధారణంగా ప్రతి బ్యాంకు కార్డుకు 16 అంకెల సంఖ్య ఉంటుంది. ఇది కస్టమర్ యొక్క ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. పేమెంట్ చేసే సమయంలో వీసా ఈ 16 -డిజిట్ నెంబర్‌ను రాండమ్ నెంబర్‌గా మార్చి స్టోర్ చేస్తుంది. కస్టమర్ ఆ కార్డును ఉపయోగించి చెల్లింపు చేయాలనుకున్నప్పుడు, వీసా కార్డు అసలు 16 -అంకెల సంఖ్యకు బదులుగా టోకెన్ నంబర్‌ను ‌ వ్యాపారితో పంచుకుంటుంది. దీంతో అవతలి వ్యక్తికి కార్డ్ నంబర్ కన్పించకుండా ఉండటమే కాకుండా లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి.

ఎలా పని చేస్తుంది?

మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్‌తో మీ కార్డును గూగుల్ పేకి అనుసంధానం చేసి, టోకెనైజ్డ్ ఫార్మాట్లో భద్రంగా ఉంచండి. చెల్లింపులు చేసేటప్పుడు గూగుల్ పే యాప్ని తెరవండి, ట్రాన్సాక్షన్ కోసం మీ బ్యాంకు కార్డును ఎంచుకోండి. ఓటీపీ ద్వారా ప్రామాణీకరించి చెల్లింపు పూర్తిచేయండి. ఈ ప్రాసెస్లో మీ16 అంకెల కార్డు నంబర్, సివివి మరియు కార్డు ఎక్స్పైరీ తేది వివరాలను పదేపదే పంచుకోవాల్సిన అవసరం లేదు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :