Wednesday, September 30, 2020

Good news for AP farmers. The government made a key announcement on October 1st



Read also:

Good news for AP farmers. The government made a key announcement on October 1st

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించింది. తాజాగా మరో కీలక ప్రకటనను అక్టోబర్ 1న వెలువరించనుంది.

అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని ప్రకటించనుంది. ఇందుకు సంబంధించి ఏయే పంటలకు ఎంత మద్దతు ధర ఉంటుందో. అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గరా డిస్‌ప్లే రూపంలో చూపించాలని వ్యవసాయ శాఖను సీఎం జగన్ ఆదేశించారు. "కనీస మద్దతు ధర కంటే రైతులు ఎక్కువ ధరే పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కనీస మద్దతు ధర లభించకపోతే. మార్కెట్ జ్యోకం తప్పనిసరిగా జరుగుతుంది" అని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం ఆన్‌లైన్‌లో స్పందన సమీక్షలో. జిల్లాల కలెక్టర్లతో ప్రసంగించిన సీఎం జగన్. ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించే అంశంపై అధికారులు రెడీగా ఉండాలని కోరారు. రైతు భరోసా కేంద్రాలు ఇందులో కీలక పాత్ర పోషించాలని కోరారు.

అధికారులు పంటల వివరాల్ని ఈ-క్రాపింగ్ విధానంలో డిస్‌ప్లే చేయాలన్న సీఎం జగన్. ఏ రైతు పేరైనా మిస్సింగ్ అయితే. దాన్ని తిరిగి చేర్చాలని కోరారు. వ్యవసాయ గ్రామ సహాయకులు కూడా దీనిపై ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ కోరారు. వరి ధాన్యం, ఇతర పంటల దిగుబడులను సేకరించే క్రమంలో. రైతుల వివరాల్ని నమోదు చేయడాన్ని అధికారులంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఏ రైతు నుంచి ఏ రోజున దిగుబడిని సేకరించేదీ. కూపన్ల రూపంలో ఇవ్వాలని కోరారు. తద్వారా ఈ సేకరణ కార్యక్రమం పక్కాగా జరుగుతుందన్నారు.

సౌకర్యాల కేంద్రాలు:

అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర. మల్టీ పర్పస్ ఫెసిలిటీస్ సెంటర్స్ (MPFCs) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపిన సీఎం జగన్. రైతు భరోసా కేంద్రాలు. పంట ఉత్పత్తుల సేకరణ, గిడ్డంగులు, క్లోడ్ స్టోరేజీలు, గ్రేడింగ్, సార్టింగ్, జనతా బజార్లు, పాల కూలింగ్ యూనిట్లు, ఆక్వాకల్చర్, ఈ మార్కెటింగ్ సదుపాయాలపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చసి సాయం చేస్తాయన్నా్రు. MPFCలకు కావాల్సిన భూమిని వచ్చే రెండు వారాలకు అందుబాటులో ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లూ చెయ్యాలని సీఎం కోరారు. వచ్చే సంవత్సరం MPFCల కోసం రూ.6300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

వ్యవసాయ సలహా కమిటీలు (AACs): వ్యవసాయ సలహా కమిటీల విషయంలో రాష్ట్ర స్థాయిలో, గ్రామ మండల స్థాయిలో, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటయ్యేలా అధికారులు చూసుకోవాలన్న సీఎం జగన్. ఖరీఫ్ సమయంలో. వ్యవసాయ సలహా కమిటీలు బాగా పనిచేశాయని మెచ్చుకున్నారు. ఫలితంగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో. 5.75 లక్షల హెక్టార్లలో పత్తితోపాటూ. ఇతర వ్యవసాయనికి విత్తనాలు నాణ్యమైనవి అందాయన్నారు. మరో 25 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం జగన్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో. రూ.10 కోట్లతో వీటిని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే మరో రూ.5 కోట్లు కూడా ఇస్తామన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :