Wednesday, September 30, 2020

How to reset your internet banking password-SBI



Read also:

How to reset your internet banking password-SBI

ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులకు పాస్‌వర్డ్ మార్చుకునే అవకాశాలన్ని స్టేట్ బ్యాంకు కల్పిస్తోంది. సెక్యూరిటీ కోసం ప్రొఫైల్ వర్డ్ ఉంటుందని తెలిసిందే. పాస్‌వర్డ్ మార్చుకోవాలని ఎస్‌బీఐ తమ నెట్ బ్యాంకింగ్ కస్టమర్తకు సూచిస్తుంటుంది. అదే విధంగా ఎవరికైనా నగదు బదిలీ (మనీ ట్రాన్స్‌ఫర్) చేసే సమయంలో ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అయితే సెక్యూరిటీ కోసం వాడే ప్రొఫైల్ పాస్‌వర్డ్ మర్చిపోయిన కస్టమర్లకు కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకునే అవకాశాన్ని నెట్ బ్యాంకింగ్ నుంచి SBI కల్పిస్తోంది.

ప్రొఫైల్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకునే విధానం:

1. మొదటగా ఎస్‌బీఐ వెబ్‌సెట్ Onlinesbi.com లో లాగిన్ అవ్వాలి.

2. మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ (My Accounts & Profile) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

3. ప్రొఫైల్‌ ను సెలక్ట్ చేసుకోవాలి

4. మై ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి

5. Forget Profile Password ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి

6. ఆ తర్వాత హింట్ క్వచ్ఛన్ (Hint Question) మీద క్లిక్ చేసి సమాధానం నమోదు చేయాలి.

7. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కొత్త పాస్ వర్డ్ ఇచ్చి, రీ ఎంటర్ పాస్‌వర్డ్ దగ్గర మీ కొత్త పాస్‌వర్డ్ మరోసారి ఎంటర్ చేయాలి.

8. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చాలు, మీ కొత్త ప్రొఫైల్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది.

ఇకనుంచి మీ ట్రాన్సాక్షన్స్, ఇతర లావాదేవీల సమయంలో ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్‌ఫుల్‌గా పని పూర్తి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయినా, ప్రొఫైల్ పాస్‌వర్డ్ మనల్ని కాపాడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :