Sunday, September 27, 2020

Dengue precautions



Read also:

వర్షాలు పడుతున్నాయి.ఈ సమయలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకే ఇప్పుడు వచ్చే జ్వరాలను ఇలా గుర్తించండి.

మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల వైరస్‌లు, ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడతాయి. అలాంటప్పుడుమనం వాటి నుంచి మనల్ని కాపాడుకునేందుకుందు టిప్స్ పాటించాలి. ముఖ్యంగా కొన్ని లక్షణాల ద్వారా సమస్యని ముందుగానే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలానే డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది. కొన్ని సార్లు డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్, ఇతర వైరస్‌ల లక్షణాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. అందుకోసమే ముందుగా ఈ జ్వరం లక్షణాలు ఏంటో తెలుసుకోండి. దీంతో మీరు తగిన విధంగా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.


డెంగ్యూ లక్షణాలు.

  • బాడీ టెంపరేచర్ పెరగటం.
  • వాంతులు, విరేచనాలు
  • కంటి నొప్పి, మంటలు
  • తలనొప్పి
  • చర్మ సమస్యలు
  • చిగుళ్ళ నుంచి రక్త స్రావం
  • మూత్రం, మలంలో రక్తం
  • కడుపు నొప్పి
  • జలుబు, దగ్గు
  • నీరసం
  • అయితే లక్షణాలన్నీ ఒకేలా ఉండవు. శరీరతత్వాన్ని బట్టి ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

  • జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. కాబట్టి ముందు వాటిని తరిమేయాలి.
  • ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి, చీకటి పడగానే తలుపులు, కిటికీలు వేసుకోవాలి.
  • చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.
  • పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.
  • ఒంటికి వేప నూనె రాయాలి. కేవలం అది మాత్రమే రాసుకోవడం ఇబ్బందిగా అనిపించి వాసనగా అనిపిస్తే కొబ్బరి నూనెతో కలిపి రాసుకోవచ్చు.
  • చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు.
  • దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
  • ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
  • పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఎక్కువ కాకుండా ఉంటాయి.

ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

  • బయటి ఆహారం తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ తీసుకోవద్దు. బయటి ఫుడ్ శుభ్రత లేకుండా తయారు చేస్తుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
  • వండిన ఆహార పదార్థాలపై ఎప్పటిప్పుడూ మూతలు పెట్టాలి.
  • వీలైనంత వరకూ తాజాగా వండుకున్న ఆహారాన్నే తీసుకోవాలి.
  • ఈ సమయంలో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా వండుకోవడం మంచిది.
  • సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
  • అందులో ఎక్కువ అల్లం, వెల్లుల్లిని వాడాలి.
  • తాజా కూరగాయలు కూడా సలాడ్‌లో భాగం చేసుకోవాలి.
  • సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

నీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి. నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుద్ధమైన నీటినే తాగాలి. ఇందుకోసం నీటిని కాచి చల్లార్చి పెట్టుకోవాలి. వాటినే తాగుతుండాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :