Sunday, September 27, 2020

Amazon great indian sale



Read also:

Amazon Great Indian sale

ఆన్లైన్ లో షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అద్భుతమైన డిస్కౌంట్ల కోసం కొన్ని రోజులు ఆగండి. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 అక్టోబర్ లో మరో సారి వినియోగదారుల ముంగిట్లోకి రానుంది. ఈ సారి మొబైల్స్, లాప్ టాప్స్, పెద్ద ఉపకరణాలపై భారీ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. దాదాపు 20 మిలియన్ల మంది ఈ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ లో పాల్గొంటారని అంచనా. దసరా, దీపావళి తదితర పండగలు దగ్గరలో ఉన్న ఈ సమయంలో అమేజాన్ గ్రేట్ ఇండియా సేల్ ద్వారా మరో సారి వినియోగదారులకు అనేక ఆఫర్లు అందించేందుకు సిద్ధమైంది.

గత సంవత్సరం ఇలాగే నిర్వహించిన ఆరు రోజుల ఫెస్టివల్ ద్వారా అమేజాన్ 3 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఈ సంవత్సరం అంచనాలు ఇంకా అధికంగా ఉన్నాయి.


ఎవరైనా చిన్న, లేదా పెద్ద ఉపకరణాలు కొనాలని భావిస్తే అమేజాన్ గ్రేట్ ఇండియా సేల్ కోసం ఆగడం మంచిది. అమేజాన్ ఈ సంవత్సరంలోనే అత్యుత్తమ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి సేల్స్ సమయంలో అమేజాన్ మనకు వివిధ బ్రాండ్ల నుంచి వచ్చే కొత్త కొత్త వస్తువులను మనకు అందిస్తుంది. ఆ వస్తువులు ఇంకా తర్వాత కూడా అమేజాన్లో అందుబాటులో ఉన్నా ఆఫర్ మాత్రం ఉండకపోవచ్చు.అయితే ఈ సారి అనేక వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఉండే అవకాశం లేదని ఒక అంచనా. ఎందుకంటే రిటైల్ మార్కెట్ నుంచి పోటీ పెద్దగా లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. కరోనా కారణంగా నష్టపోయిన రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు ఇప్పుడు పెద్దగా ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అమేజాన్ లో తగ్గింపులు అంతగా ఉండకపోవచ్చు. ఈ సారి మొబైల్ ఫోన్లు గ్రేట్ ఇండియా సేల్ లో అత్యంత అమ్ముడు పోయే వస్తువులుగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతుండడం ఇందుకు కారణం కావొచ్చు. ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ అవకాశం సైతం వివిధ వస్తువులపై అమేజాన్ అందించనుంది.

ఎప్పటిలాగే ప్రైమ్ సభ్యులకు కొంచెం ముందుగానే అమేజాన్ ప్రైమ్ ఇండియన్ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు వారికి అందుతాయి. ఈ సేల్ అధికారిక తేదీని అమేజాన్ ఇండియా ఇంకా ప్రకటించలేదు. అయితే అక్టోబర్ మధ్యలో ఈ అమేజన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 ఉండే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. అమేజాన్ సేల్ లో మీకు కావాల్సిన వస్తువులను మంచి ఆఫర్లతో సొంతం చేసుకునేందుకు సిద్ధమవండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :