Saturday, September 26, 2020

Accelerate the teacher transfers



Read also:

ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కోసం సర్వత్రా ఆసక్తి ఉంది. ముఖ్యమంత్రి జగన్ సైతం టీచర్ల బదిలీలు చేయాలని ఇటీవలే అధికారులతో అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్ సైతం మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుందని చెప్పిన గడువు కూడా ముగిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉపాధ్యాయుల బదిలీ ఫైలు ఉందని సమాచారం. అక్కడి నుంచి సంతకంతో వచ్చిన వెంటనే ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు విద్యాశాఖ కమిషనర్ సైతం బదిలీలు చేపట్టేందుకు వీలుగా పూర్తి  సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు  పూర్తి చేస్తున్నారు.  రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి తీసుకు వచ్చారు. రేషన్ లైజేషన్ కు సంబంధించి జిల్లా విద్యాధికారులు సిద్ధం చేసిన నివేదికలు, సంబంధిత అంశాల పరిశీలన ప్రక్రియ సైతం పూర్తయింది.  ప్రస్తుతం ఏ స్కూలులో ఏ పోస్టు  ఖాళీగా ఉంది,  5 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? 8 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? ఏ స్కూలులో ఎందరు అనే అంశాలపై సిద్ధమైన  సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ మరో మారు తనిఖీ చేస్తోంది. జిల్లా విద్యాధికారుల ద్వారా ఆయా  పాఠశాలలకు ఈ సమాచారం పంపి ప్రధానోపాధ్యాయుల నుంచి సరి చూసి అధికారికంగా ఖరారు చేసే ప్రక్రియ సాగుతోంది. రెండు రోజుల్లో  ఈ వివరాలన్నీ పక్కాగా ఖరారవుతాయి.  మరో వైపు  టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో చేపట్టేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ కూడా సిద్ధమవువతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉపాధ్యాయులు ఆన్ లైన్ బదిలీలను వ్యతిరేకిస్తున్నా అదే విధానం లోనే ప్రక్రియ చేపట్టబోతున్నారు.ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి  దస్ర్తం వచ్చిన వెంటనే బదిలీలకు  ప్రాథమిక విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :