Saturday, September 26, 2020

Shocking news for who have wrong details in rationcard



Read also:

Shocking news for who have wrong details in ration card

మనం చాలా సందర్భాల్లో చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే ఆ నిర్లక్ష్యమే భవిష్యత్తులో మనకు కొత్త సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. మనలో చాలామందికి రేషన్ కార్డులో పేరు, ఆధార్ కార్డులోని పేర్లు ఒకే విధంగా ఉండవు. పేరు ఒకటే అయినప్పటికీ ఒక కార్డులో ఒక విధంగా, మరో కార్డులో మరో విధంగా పొందుపరిచి ఉంటారు. చాలామంది ఇది చాలా చిన్న సమస్య అని భావిస్తారు.


ఈ విషయం తెలిసినా ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు కాబట్టి మార్చుకోవడానికి ఆసక్తి చూపరు. అయితే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులో తప్పు పేర్లు ఉన్నవారికి ఝలక్ ఇచ్చింది. కేంద్రం కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ అమలవుతోంది.

రేషన్ కార్డుతో ఆధార్ లింక్ అయిన వారు మాత్రమే వన్ నేషన్ వన్ రేషన్ కు అర్హులవుతారు. రేషన్ తో ఆధార్ లింక్ చేసుకోవడానికి కేంద్రం మరో వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రేషన్ కార్డులో పేరు, ఇతర వివరాలు తప్పుగా ఉన్నవాళ్లు సరి చేసుకోవాలని సూచనలు చేశాయి. బ్యాంకుల ద్వారా రేషన్ కార్డులో పేర్లు, ఇతర వివరాల్లో మార్పులు చేర్పులు జరిగేలా చూస్తున్నాయి.

పలు రాష్ట్రాలు రేషన్ కార్డులో పేర్లను మార్చేందుకు చార్జీలను వసూలు చేస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రాష్ట్రానికి సంబంధించిన అంశమని గతంలోనే స్పష్టం చేసింది. ఎవరైతే రేషన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసుకోరో వారు మాత్రం రేషన్ ను పొందలేరని సమాచారం.

Link Aadhar with Ration card

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :