Saturday, June 20, 2020

Good news for intermediate students



Read also:

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఫెయిలైన ఇంటర్‌ విద్యార్థులు పాస్


ఏపీలో పదవ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్ధులను కూడా ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా రద్దు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫెయిల్‌ అయిన ఇంటర్‌ విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు ఆదిమూలపు వెల్లడించారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :