Friday, May 15, 2020

On tomarrow onwards buses are allowed



Read also:

లాక్‌డౌన్ 4: బ‌స్సుల‌కు అనుమ‌తి

రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈనెల 18వ తేదీ నుంచి నాలుగో ద‌శ లాక్‌డౌన్ అమ‌లు కానున్న‌ది. ఈ ద‌శ‌లో ఎటువంటి ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తారు, ఎక్క‌డెక్క‌డ స‌డ‌లింపులు ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొత్త రూపంలో ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్ కాని జోన్ల‌లో లోక‌ల్ బ‌స్సులు న‌డిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కేంద్ర‌ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ద్వారా తెలుస్తున్న‌ది. ఆటోలు, ట్యాక్సీల‌ను కూడా ప్ర‌యాణికుల సంఖ్య‌ను కుదించి న‌డ‌పనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బ‌స్సు న‌డ‌వ‌నున్నాయి. అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌ను కూడా కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్న‌వారు మాత్ర‌మే మ‌రో రాష్ట్రానికి బ‌స్సు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. 

వ‌చ్చేవారం నుంచి దేశీయ విమాన స‌ర్వీసుల‌ను కూడా ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక రైళ్ల స‌ర్వీసులు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం నిత్యావ‌ర‌స వ‌స్తువులే కాదు, ఇక నుంచి అన్ని ర‌కాల వ‌స్తువులకు హోం డెలివ‌రీ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ 12 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భుత్వాలు నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :