Thursday, May 14, 2020

Nirmala Seetha Raman key points discussed in the live meeting



Read also:

Nirmala Seetha Raman key points discussed in the live meeting


కిసాన్‌ కార్డుదారులకు ₹25 వేల కోట్ల రుణాలు:

వ్యవసాయ రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం విధిస్తున్నాం. సకలాంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నాం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తున్నారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాం. కిసాన్‌ కార్డుదారులకు ₹25 వేల కోట్లు రుణాలు ఇస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

వలస కార్మికులకు నగదు పంపిణీ :

పట్టణ పేదలు, వలస కూలీలకు అన్నపానీయాల కోసం ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తున్నారు. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు ₹11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ చేశాం. వలస కార్మికులకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాలు అందించడానికి కృషి చేస్తున్నాం. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ₹12 వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం ₹4,200 కోట్లు:

వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తున్నారు.  గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం ₹4,200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ట్రాలకు వర్కింగ్‌ కేపిటల్‌ కింద ₹6,700 కోట్లు కేటాయిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద ₹10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా చేశాం అని చెప్పారు. 

దేశమంతా ఒకటే కనీస వేతనం:

వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొందొచ్చు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆమె వివరిస్తున్నారు. కనీస వేతనం 30 శాతం మందికే అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం. దేశమంతా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తాం. వలస కార్మికులు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకునేలా వెసులుబాటు ఇస్తున్నాం. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ₹11,0002 కోట్లు ఇప్పటికే అందించాం అని ఆర్థిక మంత్రి చెప్పారు. 

ఆగస్టు నుంచి ఒకే దేశం - ఒకే కార్డు:

రేషన్‌ కార్డులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం/ గోధుమలు పంపిణీ చేస్తాం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆమె వివరిస్తున్నారు.  ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు పంపిణీ చేస్తాం. రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం/గోధుమలు, పప్పు పొందొచ్చు. వలస కార్మికులు ఎక్కడున్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందొచ్చు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి. రేషన్‌ కార్డు పోర్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది అని మంత్రి చెప్పారు. 

స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం:

వలస కార్మికులు, పట్టణ పేదలు కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆమె వివరిస్తున్నారు. పట్టణ పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతితో ఈ గృహాల నిర్మాణం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే కేంద్రం తగిన సాయం అందిస్తుంది. వలస కార్మికులకు నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తాం. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్రం సిద్ధంగా ఉంది నిర్మల చెప్పారు. 

వర్కింగ్‌ కేపిటల్‌ రుణంగా ₹10 వేలు:

ముద్ర పథకం కింద ₹50 వేలలోపు శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  మారటోరియం అనంతరం ముద్ర రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్తాం. ఆత్మ నిర్భర్‌ భారత్ ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడిస్తున్నారు. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ₹5 వేల కోట్ల రుణ సాయం అందిస్తాం. ఒక్కొక్కరికీ ₹10 వేలు చొప్పున వర్కింగ్‌ కేపిటల్‌ కింద రుణం మంజూరు చేస్తాం. నెల రోజుల్లో రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగిస్తాం. ₹6 లక్షల నుంచి ₹18 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది అని అన్నారు. 

అడవుల పరిరక్షణ, మొక్కల నాటడం కోసం ‘క్యాంపా’ పథకం:

అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు నూతన పథకం తీసుకొస్తున్నాం. ₹ఆరు వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా ‘క్యాంపా’ పథకం తీసుకొస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం వివరాలను ఆమె వెల్లడిస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో ‘క్యాంపా’ పథకం ప్రారంభిస్తాం. దీని ద్వారా గిరిజనులకు నగదు అందుబాటులోకి వస్తుంది. దీనిని చిన్న పట్టణాల్లోనూ వినియోగించుకోవచ్చు. పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నాబార్డు ద్వారా అత్యవసర వర్కింగ్‌ కేపిటల్‌ ఫండ్‌ కింద ₹30 వేల కోట్లు కేటాయిస్తున్నాం. రబీ కోతలు, ఖరీఫ్‌ ముందస్తు ఏర్పాట్ల కోసం నిధుల వినియోగిస్తున్నాం. కొత్త నిధులతో మూడు కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుంది అని ఆర్థిక మంత్రి చెప్పారు. 

మత్స్యకారులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు:

రెండున్నర కోట్ల మంది రైతులకు కొత్తగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ అంశాలను ఆమె వివరిస్తున్నారు. రెండున్నర కోట్లమందికి రూ. రెండు లక్షల కోట్ల అదనపు రుణాలు ఇస్తాం. కిసాన్‌ క్రెడిట్‌ లేని రెండున్నర కోట్ల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. పశుపోషకులు, మత్స్యకారులకు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తాం అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :