Monday, January 13, 2020

Sankranthi cable tv offers



Read also:


గతేడాది కేబుల్ టీవీ, డీటీహెచ్ విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది ట్రాయ్. అయితే ట్రాయ్ నిబంధనలు గందరగోళం సృష్టించాయి. వినియోగదారులపై భారం పడింది. దీంతో ట్రాయ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన ట్రాయ్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకటించింది.
మీ ఇంట్లో కేబుల్ టీవీ ఉందా? నెలనెలా కేబుల్ బిల్ చెల్లిస్తున్నారా? మీకు శుభవార్త. కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI శుభవార్త చెప్పింది. వినియోగదారులకు మేలు చేసేలా కొత్త నిర్ణయాలను ప్రకటించింది. టారిఫ్ ఆర్డర్‌కు ట్రాయ్ సవరణలు చేసింది. ఇకపై రూ.130+జీఎస్‌టీ చెల్లించినవారికి 200 ఛానెల్స్ అందించాలి. గతంలో రూ.130+జీఎస్‌టీ చెల్లిస్తే 100 ఛానెల్స్ మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత ప్రతీ 25 అదనపు ఛానెళ్లకు రూ.20 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఏకంగా 200 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ చూడొచ్చు. దాంతో పాటు ప్రసార భారతికి చెందిన దూరదర్శన్ ఛానెళ్లు అదనంగా చూడొచ్చు. మొత్తం రూ.160 చెల్లించేవారికి అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకటించింది.
గతంలో బొకేలో ఉండే ఛానెళ్ల గరిష్ట ధర రూ.19 ఉండేది. ఇప్పుడు బొకే ఛానెళ్లలో ఒక ఛానెల్ ధర రూ.12 మించకూడదని ఆదేశించింది ట్రాయ్. దీంతో వినియోగదారులకు మరింత మేలు జరగనుంది. మల్టీటీవీ విషయంలో యూజర్ల ఫిర్యాదుల్ని కూడా పరిష్కరించింది ట్రాయ్. ఒకే ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో గరిష్టంగా 40% చెల్లిస్తే చాలు. అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. గతేడాది కేబుల్ టీవీ, డీటీహెచ్ విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది ట్రాయ్. అయితే ట్రాయ్ నిబంధనలు గందరగోళం సృష్టించాయి. వినియోగదారులపై భారం పడింది. దీంతో ట్రాయ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన ట్రాయ్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకటించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :