Monday, January 13, 2020

How to check the amount in your PF account



Read also:


నా పీఎఫ్ అకౌంట్‌లో ఎంత జమైంది'ఈ సందేహం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారందరికీ ఎప్పుడూ ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంత జమైందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
1. మీకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్ అకౌంట్‌లో ఇప్పటివరకు ఎంత జమైందో తెలుసా? టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇలాంటి వివరాలు తెలుసుకోవడం చాలా సులువైపోయింది. మీ పీఎఫ్ అకౌంట్‌లో ఇప్పటివరకు ఎంత జమ చేశారో ఆన్‌లైన్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు.
2. మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN యాక్టివేట్ చేయడం తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోండి. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి నాలుగు మార్గాలున్నాయి.
3. ఈపీఎఫ్ పోర్టల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మరి ఏ పద్ధతిలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకోండి.
4. EPFO Portal: ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్‌లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.
5. SMS: ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ వివరాలు తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.
6. Umang App: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన వివరాలన్నీ చూడొచ్చు.
7. Missed Call: మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ అకౌంట్‌తో రిజిస్టరై ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :