Friday, January 3, 2020

One application 35 aadhar Services



Read also:


ఆధార్.భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్ఇది. ప్రతిఒక్కరితో ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్ ఇది. ఈ ఒక్క ఆధార్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు అన్నింటికీ ఈ ఆధార్ నెంబర్ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్న.రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్న ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలి. 
అంతేకాదు ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి కూడా పాన్ స్థానంలో అధార్ కార్డు ఉపయోగించొచ్చు. ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఈ ఆధార్ పనిచేస్తుంది. అందుకే ఆధార్ కార్డుకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే ఈ ఆధార్ కు సంబంధించి యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఆ యాప్ పేరే ఎంఆధార్. 
ఈ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే ఏకంగా 35 రకాల ఆధార్ సేవలు పొందవచ్చు. అయితే ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ కేవలం ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వారు మాత్రమే ఉపయోగించగలుగుతారు. ఈ యాప్ ను ఐడెంటిటీ వెరిఫికేషన్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. 
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు మర్చిపోతే ఈ యాప్ ను ఓపెన్ చేసి డిజిటల్ ఆధార్ ను చూపిస్తే సరిపోతుంది. అంతేకాదు.. మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే.. వెబ్సైట్ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ యాప్ రిజిస్టర్ అయి ఉంటె సరిపోతుంది. ఈ యాప్ ఓపెన్ చేసి సులభంగానే ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
ఈ యాప్ తో ఆధార్ అప్డేట్ అయ్యిందా లేదా అనేది కూడా సులభంగానే చేసుకోవచ్చు. మరొక సేవ ఏంటంటే.. కేవలం 50 రూపాయలతో ఈ యాప్ ద్వారా కొత్త ఆధార్ కార్డు మీ రిజిస్టర్డ్ ఇంటి అడ్రస్‌కు వస్తుంది. ఈ యాప్ తో ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందొ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.  
ఈ ఆధార్ యాప్ 13 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా ఈ యాప్ ని ఉపయోగించచ్చు. కొత్త ఆధార్ యాప్‌తో బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ యాప్ తో మనకు ఉన్నాయి. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ ఆధార్ యాప్ ను ఇంస్టాల్ చేసుకోండి.. ఈ సేవలను పొందండి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :