Sunday, January 12, 2020

Home loan information



Read also:


ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ ప్రకారం వసూలు చేసే వడ్డీ, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ప్రకారం వసూలు చేసే వడ్డీకన్నా కనీసం 0.50% వరకూ అధికం. ఎంసీఎల్‌ఆర్‌ నుంచి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లోకి మారడం వల్ల ఆ తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఎంసీఎల్‌ఆర్‌లో వడ్డీ సాధారణంగా ఏడాదికోసారి మారుతుంటుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ విషయానికి వస్తే.. రెపో రేటు మారినప్పుడల్లా నెలలోపు దానిని అనుసరిస్తుంది.
ఎంసీఎల్‌ఆర్‌ నుంచి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు మారేందుకు బ్యాంకులు వీలు కల్పిస్తున్నాయి. చాలా బ్యాంకులు అప్పటి వరకూ ఉన్న బాకీపై 0.50 శాతం నుంచి 2శాతం వరకూ ప్రాసెసింగ్‌ ఖర్చులు వసూలు చేసి, వడ్డీ తగ్గింపు ప్రయోజనం కల్పిస్తున్నాయి. ఎస్‌బీఐలాంటి పెద్ద బ్యాంకులు అప్పు మొత్తంతో నిమిత్తం లేకుండా రూ.5,000 వరకూ చెల్లించి, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు మారే అవకాశం కల్పిస్తున్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ నుంచి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు మారే క్రమంలో కనీసం 0.50శాతం వడ్డీ భారం తగ్గుతుంది. కాబట్టి, ఒకసారి మీ బ్యాంకులో ఎంత వడ్డీ తగ్గుతుందో చూసుకొని ఈ విధానంలోకి మారే ప్రయత్నం చేయండి.
గృహరుణాన్ని ఒక బ్యాంకు నుంచి వేరే బ్యాంకుకూ మార్చుకునేందుకూ అవకాశం ఉంది. బ్యాంకులలో రిస్క్‌ ప్రీమియం వేర్వేరుగా ఉండటం వల్ల ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ అన్ని బ్యాంకులలో ఒకే విధంగా ఉండదు. కొన్ని బ్యాంకుల్లో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ప్రకారం వసూలు చేసే వడ్డీ మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఉంది. ఇలాంటప్పుడు అదే బ్యాంకులో కొనసాగడం కన్నా తక్కువ వడ్డీ ఉండే బ్యాంకులోకి రుణాన్ని మార్చుకోవడం ద్వారా లాభం పొందవచ్చు. దీనికోసం ముందుగా ఏయే బ్యాంకులలో తక్కువ వడ్డీకి అప్పు ఇస్తున్నారు.. ఇతర ఖర్చులు ఏ మేరకు ఉండొచ్చు.. అనేవీ చూసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఖర్చులలో తగ్గింపు లేదా మినహాయింపు ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడ మారడం వల్ల ఇతర ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఈ నెల 31 వరకూ టేక్‌ఓవర్‌ రుణాలపై ఎస్‌బీఐ ప్రాసెసింగ్‌ ఖర్చు మినహాయింపుతోపాటు వడ్డీలో తగ్గింపునూ 

లాభమెంత

  • రూ.30లక్షల గృహరుణాన్ని 30 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం.. 8.50శాతం వడ్డీతో నెలకు రూ.23,067 వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు 8.00శాతం అయితే.. ఈ వాయిదా రూ.22,012 అవుతుంది. అంటే... ప్రతి నెలా రూ.1,055 వరకూ ఆదా అవుతుందన్నమాట. ఈ లెక్కన 30 ఏళ్లకు రూ.3,80,000 వరకూ మిగులుతాయి. 
  • ఇక వడ్డీ తగ్గినా.. పాత వాయిదా రూ.23,067ను అలాగే కొనసాగిస్తే.. మీ అప్పు 25.2 ఏళ్లలోనే తీరిపోతుంది. అంటే.. 58 నెలల ముందుగానే అన్నమాట. 
  • వడ్డీ తగ్గినప్పుడు మిగిలిన వాయిదా మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేసేందుకు ప్రయత్నించండి. సుమారు 12 శాతం వార్షిక రాబడి అంచనాతో.. 
  • 30 ఏళ్లపాటు నెలకు రూ.1,055 మదుపు చేస్తే.. దాదాపు రూ.32 లక్షలు చేతికందే అవకాశం ఉంది. మన ఆర్థిక స్థితి అనుకూలిస్తే.. అప్పు వాయిదా తగ్గించుకోకుండా.. వీలైనంత తొందరగా అప్పును వదిలించుకోవడమే ఉత్తమం. ఇదే సమయంలో ఇతర లక్ష్యాలను విస్మరించకూడదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :