Tuesday, January 14, 2020

FastTag information



Read also:


వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఫాస్ట్ ట్యాగ్‌లో సరైన బ్యాలెన్స్ ఉండాలి. అలాంటివారికే ఉచితంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
హైవేలపై వెళ్లే వాహనదారులకు శుభవార్త చెప్పింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI. టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా పనిచేయకపోతే ప్రయాణికులు టోల్ ఫీజు చెల్లించకుండా ఫ్రీగా వెళ్లిపోవచ్చని ప్రకటించింది. జనవరి 15 నుంచి హైవేలపై వెళ్లే ప్రతీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అయితే ఫాస్ట్ ట్యాగ్ సరిగ్గా రీడ్ కాకపోతే సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ కాకపోతే వాహనదారులు ఉచితంగా వెళ్లిపోవచ్చు. ఇందుకోసం నియమనిబంధనల్లో సవరణలు చేసింది. టోల్ ప్లాజాలో ఫాస్ట్‌ట్యాగ్ మెషీన్లు వాహనాలకు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేయకపోతే టోల్ ఫీజు లేకుండా వాహనాలు వెళ్లిపోవచ్చు. వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఫాస్ట్ ట్యాగ్‌లో సరైన బ్యాలెన్స్ ఉండాలి. అలాంటివారికే ఉచితంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

జనవరి 15 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది ఎన్‌హెచ్ఏఐ. ఇకపై జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ ఏదైనా వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాల దగ్గర తీసుకోవచ్చు. లేదా బ్యాంకులు, ఆర్‌టీఓ ఆఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేనివాళ్లు జరిమానాలు చెల్లించక తప్పదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :