Saturday, January 4, 2020

Eat citrus fuits to control everything



Read also:


మన దేశంలో సపోటా పండ్లతో కివీ పండ్లను పోల్చుతుంటారు. ఐతే.రెండింటి టేస్టూ వేరుగా ఉంటుంది. పోషకాలు కూడా వేరే. కివీ ఎందుకు తినాలో తెలుసుకుందాం. 
Kiwi Fruit Health Benefits : గుడ్డు సైజులో ఉండే కివీ ఫ్రూట్‌కి ఇప్పుడు ఇండియా భారీ మార్కెట్ అయిపోయింది. న్యూజిలాండ్‌లో ఈ పండ్లు అలా పండుతాయో లేదో.ఇలా ఇండియాకి ఎగుమతి అయిపోతున్నాయి. ఆ వెంటనే ప్రజలు వాటిని కొనేస్తున్నారు. సాధారణంగా పండ్లలో గింజలుంటాయి. వాటిని తొలగించి తినాల్సిందే. కివీ పండులో కూడా గింజలు ఉన్నా.అవి అరటి పండులో గింజల్లా ఉంటాయి. అందువల్ల గింజలతో సహా తినేసే వీలు ఈ పండుకు ఉంది. తొక్కతో సహా తినవచ్చు గానీ.99 శాతం మంది తొక్క తీసి తింటారు. తినేందుకు ఎంతో ఈజీగా ఉండటం వల్ల, రుచి కూడా ప్రత్యేకంగా ఉండటం వల్ల ఇండియాలో ఈ పండ్లను ఇప్పుడు బాగా ఇష్టంగా తింటున్నారు.

నిజానికి ఈ పండు పుట్టింది న్యూజిలాండ్‌లో కాదు. ఉత్తర, మధ్య, తూర్పు చైనాలో. ఎప్పుడో 12వ శతాబ్దంలో.సాంగ్ సామ్రాజ్య కాలంలో ఈ పండును వాడేవారు. ఆ తర్వాత ఇందులో ఉన్న పోషకాల వల్ల దీన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. మొదట్లో చైనీయులు దీన్ని మందుల తయారీలో మాత్రమే వాడేవారు. అక్కడ ఈ పండును చైనా గూస్‌బెర్రీ, యాంగ్ తావ్ అని పిలుస్తారు. ఐతే.20వ శతాబ్దంలో ఈ పండు తొలిసారిగా న్యూజిలాండ్ వెళ్లింది. అంతే.ఆ తర్వాత ఇది ఆ దేశపు పండుగా మారిపోయింది. దీని పేరు కూడా.న్యూజిలాండ్‌ జాతీయ పక్షి అయిన కివీ పక్షి పేరు పెట్టారు.

ఇప్పుడు ప్రపంచపు వాణిజ్య పంటల్లో కివీ ఫ్రూట్ కూడా అత్యంత ముఖ్యమైన పంటగా మారిపోయింది. కివీ పండ్లు ఎక్కువగా అడవులు, పర్వతాలు, కొండల్లో పండుతాయి. కొద్దిగా ఎండ ఉన్నా ఇబ్బందేమీ లేదు. వీటిలో బరువు, పరిమాణం, ఆకారం, మెత్తదనాన్ని బట్టీ రకరకాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ కలర్‌లో ఉండే కివీ పండును ఎక్కువగా వాడుతోంది. ఇవైతే ఏడాదంతా అందుబాటులో ఉంటాయి.

ఇప్పటికీ చైనాలో కివీ పండును పెద్దగా తినరు. పిల్లల మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అలాగే గర్భిణీ మహిళలకు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ పండు నుంచీ తీసే యాక్టినిడిన్‌ను.మాంసం వండేందుకు ఉపయోగిస్తున్నారు. కివీ పండును జ్యూస్, జామ్, క్యాండీస్‌లో కూడా వాడుతున్నారు. చిత్రమేంటంటే ఈ పండు అంత పులుపుగా ఏమీ ఉండదు. కానీ... నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. 100 గ్రాముల కివీలో 93 మిల్లీ గ్రాముల సీ విటమిన్ ఉంటుంది. అదే 100 నిమ్మకాయలో 54 మిల్లీగ్రాముల సీ విటమిన్ మాత్రమే ఉంటుంది.

కివీ పండ్లలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్.కివీ పండులో బాగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ బాగా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఆస్తమా తగ్గేందుకు కూడా కివీ పండును ఉపయోగిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :