Thursday, January 16, 2020

Best mobiles before 10thousand



Read also:


1. Realme 5s: రియల్‌మీ 5 సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 5ఎస్. గతంలోనే రిలీజ్ అయిన రియల్‌మీ 5 మోడల్‌లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయి. రియల్‌మీ 5 మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్‌మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్.
2. Realme 5s: రియల్‌మీ 5ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాలు డిస్‌ప్లే ఉంది. రియల్‌మీ 5ఎస్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్.
3. Realme 5s: రియల్‌మీ 5ఎస్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్, క్రిస్టల్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.
4. Redmi Note 7 Pro: గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రో. ఈ ఏడాది కూడా బెస్ట్ స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటి. ఇటీవల రెడ్‌మీ నోట్ 7 ప్రో ధర భారీగా తగ్గింది. రూ.10,000 లోపే లభించడం విశేషం. రెడ్‌మీ నోట్ 7 ప్రో ఆకట్టుకోవడానికి కారణం స్పెసిఫికేషన్సే. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.
5. Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 48+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా ఉండగా, ఫ్రంట్‌లో 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరాలున్నాయి.
6. Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆస్ట్రో మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.
7. Redmi Note 8: రూ.9,999 ధరకే షావోమీ రిలీజ్ చేసిన 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరా, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం.
8. Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ నోట్ 8 రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్.
9. Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ఫోన్‌తో పాటు 18వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.
10. Lenovo K10 Note: ఇటీవల లెనోవో కూడా కే10 నోట్ స్మార్ట్‌ఫోన్‌తో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ రేస్‌లో అడుగుపెట్టింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత.
11. Lenovo K10 Note: లెనోవో కే10 నోట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ 4,050 ఎంఏహెచ్. 16+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
12. Lenovo K10 Note: లెనోవో కే10 నోట్ 4 జీబీ+64 జీబీ ధర రూ.9,999.
13. Vivo U10: వివో యూ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ వివో యూ10. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాచ్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
14. Vivo U10: వివో యూ10 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.35 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 655 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+8+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.
15. Vivo U10: వివో యూ10 బ్యాటరీ 5,000 ఎంఏహెచ్. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ బ్లూ, థండర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. వివో యూ10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.9,990.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :