Thursday, January 16, 2020

Five thousand camels were shot dead. Within 5 days



Read also:


ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చుతో ఇప్పటికే లక్షలాది అడవి జంతువులు కాలి బూడిదయ్యాయని.. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే ఒంటెలను చంపండం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకకుండా. కాల్చి చంపడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. 
ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్నంత పని చేసింది. కరువు ప్రాంతాల్లో సుమారు 5వేలకు పైగా ఒంటెలను కాల్చి చంపింది. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపేసినట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. అనంగు పిజంజజరా యకుంజజరా ప్రాంత అధికారుల (APY) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వాటి కళేబరాలను తగులబెట్టారు. ఆస్ట్రేలియా అడవులను కార్చిచ్చు దహించివేస్తున్న విషయం తెలిసిందే. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్‌లోని తీర ప్రాంత అడవులు పెద్ద మొత్తంలో తగలబడుతున్నాయి. ఈ మంటల్లో లక్షలాది అడవి జంతువులు సజీవ దహనమయ్యాయి. లక్షల ఎకరాల్లో అటవీ సంపద కాలి బూడిదయింది. భారీగా ఆస్తి నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రులయ్యారు. కార్చిచ్చు నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు.
కరవు నెలకొన్న ప్రాంతాల్లో ఒంటెల సంఖ్య ఎక్కువగా ఉంది. సాధారణంగానే ఒంటెలు అధికంగా నీరు తాగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటెలు ఎక్కువ నీరు తాగడం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహంతో ఒంటెలు ఇళ్లలోకి చొరబడి నీటి తొట్లు, డ్రమ్ములు, ఏసీల నుంచి నీరు తాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయి. ఒంటెల సంచారంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర వేడి కారణంగా అసౌకర్యానికి గురై, అనారోగ్యం బారిన పడుతున్నామని..ఒంటెలతో మరిన్ని సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఒంటెలను చంపుతోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ఆస్ట్రేలియాలో సుమారు 10 లక్షల ఒంటెలున్నట్లు అంచనా. 19వ శతాబ్దంలో దాదాపు 20 వేల ఒంటెలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటి సంతతి పెరిగి ఇప్పుడు దాదాపు 10 లక్షలకు చేరుకుంది. ఐతే ఇటీవల చెలరేగిన కార్చిచ్చుతో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్‌ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు ఏర్పడింది. ఈ క్రమంలో నీటి కోసం ఒంటెల మందలు జనావాసాలపై పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఒంటెలు ఏడాదికి ఒక టన్ను కార్బన్‌డైయాక్సైడ్‌తో సమానమైన మీథేన్‌ను విడుదల చేస్తున్నాయని.. వాటిని చంపేందుకు ఇది కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. 
మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చుతో ఇప్పటికే లక్షలాది అడవి జంతువులు కాలి బూడిదయ్యాయని.. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే ఒంటెలను చంపండం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకకుండా. కాల్చి చంపడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :