Friday, January 3, 2020

Amma Vodi instructions



Read also:

ిశాఖపట్నం జిల్లా  మండల విద్యాశాఖ అధికారులు మరియు  ఎం‌ఆర్‌సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచనలు.
•అమ్మ ఒడి పథకం కింద రెండు , మూడవ జాబితాలో వచ్చిన తల్లి  లేదా సంరక్షకుని  వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పంపించినవి.  వాటిని ఎవరైనా ఈ పథకం కింద అర్హులమని గాని లేదా తమ పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదని కానీ, వారి వివరాలలో తగిన ధృవపత్రాలను సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 5-1-2020 సాయంకాలం 5 గంటల లోపు అందజేయాలి.
•ఈ విధంగా అందజేసిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరు అని రాష్ట్ర కార్యాలయం తెలియజేసింది.
•కాబట్టి జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మనం వివరాలు అప్లోడ్ చేయుటకు  తుది సమయం . కాబట్టి ప్రతి మండల విద్యాశాఖ తమ పరిధిలోని  సిబ్బందితో సమన్వయం చేసుకొని ఈ తదుపరి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి మరియు అప్లోడ్ చేయవలసి ఉన్నది.
•రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జగన్ అమ్మ ఒడి అర్హతలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఎకౌంటు మరియు ఐఎఫ్ఎస్ కోడ్ కలిగి ఉండాలి .
•తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి కూడా లబ్ధి చేకూరుతుంది.
•స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల మరియు వీధి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది .
•అర్హత కలిగిన తల్లుల లేదా సంరక్షణ పిల్లల కనీస హాజరు డెబ్భై అయిదు శాతం పరిశీలించి ధృవీకరించు కావాల్సి ఉంటుంది.
•ఒక తల్లి కి ఎంతమంది పిల్లలు ఉన్నా తో సంబంధం లేకుండా ఏ తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు .
•కొత్త రేషన్ కార్డు పొందడానికి నూతన అర్హతలు అమ్మవొడికి కూడా ఉంటాయి.  అవి క్రింది విధంగా ఉన్నాయి .
•ఆదాయ పరిమితి : నెలవారి ఆదాయం గ్రామాలలో  10000,  అర్బన్ ప్రాంతాల్లో 12,000.
•కుటుంబం యొక్క మొత్తం ల్యాండ్ హోల్డింగ్ (భూమి కలిగి ఉండటం) : ( ఈ రాష్ట్రం మొత్తం ఒకే క్రైటీరియా తీసుకోబడుతుంది) :  మాగాణి భూమి మూడు ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  ఈ రెండూ కలిపి కూడా 10 ఎకరాలు కన్నా ఎక్కువ ఉండరాదు.
•ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  ఒక కుటుంబము యొక్క విద్యుత్ వినియోగం 6 నెలల  యావరేజ్ గా తీసుకున్నప్పుడు నెలకు  300 యూనిటీ ల కన్నా తక్కువ ఉండవలెను .
•అన్ని ప్రభుత్వ  ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ కు ఈ పథకం వర్తించదు.
•నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.
•ఈ పథకంలో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని మినహాయింపు ఉంటుంది .
•ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
•మున్సిపల్ ఏరియాలో 750 స్క్వేర్ ఫీట్  కన్నా తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాన్ని కూడా వర్తిస్తాయి.
•కొత్త రేషన్ కార్డు నిమిత్తము  కుటుంబాలకి అర్హత ఉద్దేశించబడింది అవే అమ్మ ఒడి పథకానికి కూడా వర్తిస్తాయి.
List-2 required re verification లో supporting documents తీసుకోనే విధానము :
•List-2&3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను
•ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
•1. Electricity ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
•a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.
•b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి. అసలు కరెంట్ లేకపోతే సంబంధిత అధికారి నుండి కనెక్షన్ లేదనే ధృవీకరణ పత్రము అప్లోడ్ చేయాలి.
•2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
•3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
•4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా (ఈ లిస్ట్ లో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని వివరాలు ఉంటే ఆ వాహనం నంబరు ఫోటో తీసి ) లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి. .
•5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
•6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు(భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి)తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
•ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అని పొరపాటుగా నమోదుచేస్తే డిక్లరేషన్ మరియు వెరిఫికేషన్ పత్రాలు అప్లోడ్ చేయాలి. 
కావున ఈ విషయములో వెంటనే పై మార్గదర్శకాలు అనుగుణంగా  పని చేయవలసిందిగా కోరుచున్నాము.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :