Thursday, January 16, 2020

Banks bundh upcoming 3days



Read also:


దేశవ్యాప్తంగా మరోసారి సమ్మెకు దిగుతున్నాయి బ్యాంక్ యూనియన్లు. వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ముందుకు సాగకపోవడంతో జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని యూనియన్లకు బ్యాంకు యూనియన్ల సమాఖ్య ( UFBU) పిలుపునిచ్చింది.  ఈ నేపథ్యంలో జనవరి 31 (శుక్రవారం), ఫిబ్రవరి 1 (శనివారం) బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరి 2 ఆదివారం కావడంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు.  దాంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు తెరచుకోవు.
మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా సమ్మెను నిర్వహిస్తామని UFBU తెలిపింది. అప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. భారతీయ బ్యాంకుల సంఘంతో వేతన సవరణపై చర్చలు విఫలం కావడంతో UFBU ఈ నిర్ణయం తీసుకుంది.  కనీసం 15శాతం వేతనాలను పెంచాలని యూనియన్లు కోరుతున్నాయి. కాగా, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ దేశవ్యాప్తంగా UFBU దేశవ్యాప్తంగా 9 కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :