Monday, January 13, 2020

AP TET DSC Notification 2020



Read also:


ఏపీ రాష్ట్రంలో త్వరలోనే AP TET, DSC నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తి చేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్‌లలో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు టెట్ నొటిఫికేషన్‌పై దృష్టి సారించారు. తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో వారు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2020, జనవరి 12వ తేదీ ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డీఎస్సీలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరించడానికి తాము ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గత పాలకులు కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా..అధ్యాపక పోస్టులకు అనుమతి ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఏ మేరకు భర్తీ చేయాలో పరిశీలించి..త్వరలోనే నియామక ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలివిడత రూ. 3 వేల 600 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
గతంలో టీచర్ అర్హత పరీక్ష (టెట్), టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ) కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే..ఈసారి రెండింటినీ కలపకుండా..వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వాహణకు అడుగులు వేస్తున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా..టెట్ నోటిఫికేషన్‌ను జనవరి మొదటి వారంలో ఆ తర్వాత..నెలాఖరును డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :