Monday, January 13, 2020

How to book a aadhar slot



Read also:


మీరు మీ ఆధార్‌ కార్డులో ఏవైనా కరెక్షన్స్ చేయించాలా? ఆధార్‌లో వివరాలు అప్‌డేట్ చేయించాలా? ఆధార్ సెంటర్లతో పాటు ఆధార్ సేవా కేంద్రాల్లోనూ ఈ సేవలు పొందొచ్చు. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు పొందాలంటే ముందే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల లాగా ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఆధార్ సేవా కేంద్ర-ASK ప్రాజెక్ట్‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
2. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల లాగా ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఆధార్ సేవా కేంద్ర-ASK ప్రాజెక్ట్‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. 
3. ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్‌కు సంబంధించిన సేవలన్నీ పొందొచ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లాంటి వివరాల అప్‌డేషన్ లాంటి సేవలు ఏవైనా పొందొచ్చు.
4. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సెంటర్ల కన్నా ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ సేవలు వేగంగా అందుతాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు పొందాలంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నట్టే ఆధార్ సేవా కేంద్రాలకు స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయంలో వెళ్లి సేవలు పొందొచ్చు.
5. ఆధార్ సేవా కేంద్రాలు వీకెండ్‌ సహా ఆరు రోజులు పనిచేస్తాయి. మంగళవారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్ రోజు ఆధార్ సేవా కేంద్రాలకు సెలవు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
6. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి. My Aadhaar ట్యాబ్‌లో 'Book an Appointment' పైన క్లిక్ చేయండి.
7. సిటీ లొకేషన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. New Aadhaar, Aadhaar Update, Manage Appointment ఆప్షన్స్ కనిపిస్తాయి.
8. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ వివరాలన్నీ ఆన్‌లైన్ ఫామ్‌లో ఎంటర్ చేయాలి.
9. అపాయింట్‌మెంట్ వివరాలు, వ్యక్తిగత వివరాలు ఫిల్ చేసిన తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అపాయింట్‌మెంట్ వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :