Wednesday, December 18, 2019

YSR pension kanuka new updates



Read also:

వైఎస్సార్ పింఛన్‌కు దిశానిర్దేశాలు.. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్!
వైఎస్సార్ పింఛన్‌కు ఏపీ ప్రభుత్వం దిశానిర్దేశాలు ఖరారు చేస్తూ కొత్త జీవోను జారీ చేసింది. పాత జీవోలో పేర్కొన్న కొన్ని అర్హత నిబంధనలు సవరిస్తూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపోతే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్యం, వితంతు పింఛన్లను రూ.2,250కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.
కుటుంబంలో ఒక్కరే పెన్షన్‌కు అర్హులు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయం ప్రతీనెలా రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయం రూ.12 వేలు కలిగి ఉండాలి. అంతేకాకుండా నిరుపేదలు 3 ఎకరాల తరి లేదా పది ఎకరాల మెట్ట.. లేదా ఈ రెండూ కలిపి పది ఎకరాలు కలిగి ఉండాలి.
మరోవైపు టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు తప్పితే ఫోర్ వీలర్లు లబ్దిదారులకు ఉండకూడదు. అటు పెన్షనర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఉన్నా.. వారు వైఎస్సార్ పెన్షన్‌కు అర్హులు కారు.
ఇకపోతే ప్రతీనెలా కరెంట్ వినియోగం 300 యూనిట్లు మించరాదు. అంతేకాకుండా కుటుంబంలో ఎవరూ కూడా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ చెల్లించి ఉండకూడదు. అలా అయితేనే వాళ్ళు పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. అంతేకాకుండా 80 శాతం పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసిక వ్యాధితో బాధపడుతోన్న వారు ఉన్నా.. వారికి పింఛన్ లభిస్తుంది.
నిరుపేదలు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. అంతేకాకుండా ఎస్సి కేటగిరికి చెందిన వారు 50 సంవత్సరాలు, ఆపై వయసు కలిగి ఉండాలి. ఇక 18 ఏళ్ళు దాటిన వితంతువులు.. తన భర్త చనిపోయినట్లు ధృవీకరించే పత్రం కలిగి ఉండాలి. అటు దివ్యాంగులకు అయితే నో ఏజ్ లిమిట్. చేనేత కార్మికులకు అయితే 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. గీత కార్మికులకు కూడా ఇదే ఏజ్ పరిమితి. మరోవైపు 18 సంవత్సరాలు దాటిన ట్రాన్స్‌జెండర్లు వైద్య శాఖ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మత్స్యకారులు 50 సంవత్సరాల పైబడి ఉండాలి.ఇలా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ పింఛన్‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :