Wednesday, December 18, 2019

Final settlement in 2 days only if you resign your job



Read also:

ఉద్యోగానికి రాజీనామా చేశారా ఇక నుంచి ఉద్యోగం వదిలేసిన రెండు రోజుల్లోనే ఫైనల్ సెటిల్ మెంట్

ఉద్యోగం రాజీనామా చేయడమంటే మాటలు కాదు. కొంచెం అటూ ఇటూ అయినా ఓ కుటుంబమే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది. వేరే ఉద్యోగం వచ్చినా సరే.పాత కంపెనీకి గుడ్ బై చెప్పగానే జీతం, ఇతరత్రా అలవెన్స్ వెంటనే కంపెనీ ఇవ్వదు. సెటిల్ మెంట్ చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అది కొంతమేర ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చేదే. అందుకే.. ఇక నుంచి అలా కాకుండా.ఉద్యోగం వదిలేసిన రెండు రోజుల్లోనే ఫైనల్ సెటిల్ మెంట్ చేసేలా రూల్స్ మారాయి. 
కోడ్ ఆన్ వేజెస్, 2019 ప్రకారం, ఉద్యోగానికి రాజీనామా చేసి చివరి రోజు పని చేసిన తర్వాత రెండు రోజుల్లోనే కంపెనీ సదరు ఉద్యోగి ఫైనల్ సెటిల్ మెంట్ చేసేయాలి. ఫైనల్ సెటిల్ మెంట్ అంటే.
అప్పటి వరకు పని చేసిన పనిదినాలకు జీతం, అలవెన్సులు రెండు రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగిని కంపెనీ తీసేసినా, ఉద్యోగే రాజీనామా చేసినా, కంపెనీ మూతపడినా, రెండు రోజుల్లోనే కంపెనీ ఆ ఉద్యోగికి ఫైనల్ జీతం చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏంటంటే?

ప్రస్తుతం ఉన్న పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, 1936 ప్రకారం.ఉద్యోగి తన ఉద్యోగాన్ని మానేసిన తర్వాత ఎప్పటిలోగా ఆ ఉద్యోగి ఫైనల్ సెటిల్ మెంట్ చేయాలి.అనేది కంపెనీ ఇష్టం. కంపెనీ పాలసీల ప్రకారం.. సదరు ఉద్యోగికి ఫైనల్ సెటిల్ మెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగిని కంపెనీ తీసేసినా... కంపెనీ మూతపడినా 1936 యాక్ట్ ప్రకారం.. ఉద్యోగం పోయిన రెండో రోజు వర్కింగ్ డే ముగిసే సమయానికి సెటిల్ మెంట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే, ఫ్యాక్టరీ, ఇతర ఇండస్ట్రీ కంపెనీల్లో మాత్రం 1000 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉంటే ఉద్యోగం పోయిన ఏడో రోజు వర్కింగ్ డే ముగిసే సమయానికి సెటిల్ మెంట్ చేయాల్సి ఉంటుంది. 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే.. ఉద్యోగం పోయిన నాటి నుంచి పదో రోజు వర్కింగ్ డే ముగిసే సమయానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. 
కానీ.కోడ్ ఆన్ వేజెస్ 2019 ప్రకారం.ఉద్యోగం పోయినా, రాజీనామా చేసినా, కంపెనీ మూతపడినా... రెండు రోజుల్లోనే ఉద్యోగికి ఫైనల్ సెటిల్ మెంట్ చేయాలి. అంతే కాదు.ఈ యాక్ట్ ప్రకారం.. కంపెనీలు తమ ఉద్యోగులకు సరిగ్గా, సరైన సమయానికి జీతాలు ఇవ్వాలి. ప్రస్తుతానికి ఈ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ అయినా.. ఎప్పుడు అమలు అవుతుంది.. అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యాక్ట్ ను అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్ అమలులోకి వస్తే.. ఉద్యోగులకు కొంచెం భరోసా లభించినట్టే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :