Wednesday, December 11, 2019

Today onwards RTC bus charges increased



Read also:

రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. ‘‘పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరకు  10పైసలు పెంపు. పల్లె వెలుగు బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపులేదు. ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 20 పైసలు పెంపు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు చొప్పున పెంపు. వెన్నెల, స్లీపర్‌ బస్సుల్లో ఛార్జీలపెంపు లేదు’’ అని  ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. డీజిల్ ధర పెంపు వల్ల  సంస్థపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని, విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల  ఏటా మరో రూ.650 కోట్ల భారం పడుతోందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డీజిల్‌ ధర నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి చేరిందని వెల్లడించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :