Sunday, December 15, 2019

post office minimum balance rules



Read also:

పోస్టాఫీస్ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ తెలుసా

పోస్టాఫీస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆకర్షణీయ వడ్డీ పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే ఇక్కడ పోస్టాఫీస్ స్కీమ్స్ కింద అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ అవసరం అవుతుంది. పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.500 అవసరం అవుతుంది. అదే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తెరవాలంటే రూ.500 కావాలి. చెక్‌బుక్ అవసరం అనుకుంటే ఈ రూ.500 కావాలి. లేదనుకుంటే ఖాతాదారుడు రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ విషయానికి వస్తే.. మినిమమ్ బ్యాలెన్స్ రూ.100గా ఉంది. అలాగే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్) అకౌంట్‌కు కూడా రూ.100 మినిమమ్ అమౌంట్ ఉండాలి.అదేసమయంలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ అకౌంట్‌కు రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ ఉంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ సేవలు కూడా అందిస్తోంది. ఈ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు. నెలలో ఏ రోజైనా ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.
ఇకపోతే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను ఆరు నెలలు, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్‌ను ఏడాది తర్వాత మాత్రమే క్లోజ్ చేసుకోగలం. సీనియర్ సిటిజన్ అకౌంట్‌ కూడా ఏడాది తర్వాతనే క్లోజ్ చేసుకోవడానికి వీలవుతుంది. పోస్టాఫీస్‌లో అకౌంట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఒక పోస్టాఫీస్ నుంచి వేరొక పోస్టాఫీస్‌కు అకౌంట్లను బదిలీ చేసుకోవచ్చు. దీని కోసం పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను అందజేయాలి. తర్వాత అకౌంట్ మీరు కోరుకున్న పోస్టాఫీస్‌ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :