Wednesday, December 25, 2019

Huge carbo hydrates in potatos



Read also:

బంగాళా దుంపను తరుచూ తీసుకుంటే శరీరంలో కార్బోహైడ్రేట్లు పెంచుకోవచ్చు
తేల్చి చెప్పిన యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు
ముఖ్యంగా అథ్లెట్లకు కార్బోహైడ్రేట్లు అధికంగా అవసరం
మనకు తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే కూరగాయల్లో బంగాళా దుంపలు ఒకటి. చాలా మంది బంగాళా దుంప కూరను చాలా ఇష్టంగా తింటారు. ఈ కూరగాయను తరుచూ తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు పెంచుకోవచ్చని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా అథ్లెట్లకు కార్బోహైడ్రేట్లు అధికంగా అవసరమవుతాయి. ఇందుకోసం మాంసం, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటి కోసం అధికంగా ఖర్చవుతుంది.

అయితే, బంగాళా దుంపలతోనే శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా పొందవచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు వెల్లడించారు. కొన్నేళ్లుగా అథ్లెట్లపై చేసిన పరిశోధనల ఫలితంగా ఈ విషయం వెల్లడయిందని వివరించారు. అథ్లెట్లు వేగంగా శక్తిని పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తేల్చారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :