Wednesday, December 25, 2019

solution for Dengue



Read also:

వివరాలు వెల్లడించిన భారతీయార్‌ వర్సిటీ పరిశోధకులు
కోయంబత్తూర్‌లోని ఎడిస్‌ ఈజిప్టి దోమల్లో వోల్బాచియా పిపియెంటిస్‌ బ్యాక్టీరియా
ఈ బ్యాక్టీరియాతో దోమలు వైరస్ లను వ్యాప్తి చేయలేవు
డెంగీ జ్వరాల విజృంభన సమాజంలో ఎంతటి అనారోగ్య పరిస్థితులను తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దేశంలో డెంగీ మరణాల సంఖ్య అధికంగానే ఉంది. నిలువెత్తు మనిషిలో ఈ రోగాన్ని చిన్ని దోమ తెచ్చిపెడుతుంది. అయితే, దోమలు తెచ్చి పెట్టే ఈ డెంగీకి దోమల్లోనే పరిష్కారం ఉందని భారతీయార్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చారు.

తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఎడిస్‌ ఈజిప్టి దోమల్లో వోల్బాచియా పిపియెంటిస్‌ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు. డెంగీతో పాటు  జికా, చికున్‌ గున్యా  వంటి వైరస్ లు కూడా ఎడిస్‌ దోమల ద్వారానే వ్యాపి చెందుతాయి. అయితే ఈ పిపియెంటిస్ బ్యాక్టీరియాతో దోమలు వైరస్ లను వ్యాప్తి చేయలేవు. తమ సంతానాన్ని పెంచుకోనివ్వకుండా కూడా ఈ ఇది నిరోధిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలు ఇతర దోమలతో కలిస్తే వాటికి కూడా ఇది సోకుతుంది. దీంతో దోమలను నిర్మూలించవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :