Sunday, December 1, 2019

chaina new invention on sun



Read also:

కృత్రిమ సూర్యుడ్ని రూపొందిస్తున్న చైనా 2020లో అందుబాటులోకి

బీజింగ్‌: చైనా శాస్త్రవేత్తలు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కృత్రిమ సూర్యుడిని వారు రూపొందిం చడానికి ప్రయోగాలు చేస్తు న్నారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌ వరకు అందు బాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టును హెచ్‌ఎల్‌-2ఎం టోకామాక్‌ పేరుతో రూపకల్పన చేస్తున్నారు. ఇందులో సహజంగా సూర్యుడిలో జరిగే ప్రక్రియల లాగానే ఇందులో కూడా హైడ్రోజన్‌, డ్యూటేరియం వాయు ఇంధనాలను అణు సంలీనం చేస్తుందని చెబుతున్నారు. ఇక దీని నుంచి అనంతమైన, పర్యావరణ హితమైన శక్తి విడుదల అవుతుందని తెలిపారు. ఈ పరికరం ద్వారా 200 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణం వెలువడుతుందనీ, రాబోయే తరాలకు ఉపయుక్తం కోసం ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్టు సౌత్‌ వెస్టర్నన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ చైర్మెన్‌ డువాన్‌ జురు చెప్పారు.
శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ (ఐటిఇఆర్‌)కూడా ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం కూడా అందిస్తున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించినప్పుడు కేవలం 100 మిలియన్‌ డిగ్రీల ఉష్ణాన్ని మాత్రమే వెలువర్చే విధంగా రూపొందించినా . తరువాత ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. జూన్‌లో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేవడానికి పనులను వేగవంతం చేసినట్టు ప్రాజెక్టు డైరెక్టర్‌ గాంగ్‌ జియాన్జ్‌ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :