Sunday, December 1, 2019

updated aadhar information



Read also:


ఆధార్ నెంబర్ తప్పుగా ఇచ్చారో.రూ. 10, 000/- జరిమానా జాగ్రత్త సుమా

ఆధార్ కార్డు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ఉండే ఒక ఐడెంటిటీ. ఆధార్ కార్డు కలిగిన వారు మాత్రం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేందుకు ఐటీఆర్ సమయంలో పాన్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ ఇచ్చే వెసులుబాటు ఇప్పుడు కల్పించింది. అయితే ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి మరి. మీరు ఇచ్చే ఆధార్ నెంబర్ తప్పు అయితే మాత్రం మీకు రూ.10 వేల జరిమానా పడతాయి.

ఇన్‌ కమ్ ట్యాక్స్ చట్టం 1961 కు సవరణలు చేశారు. దీనితో పాన్ నెంబర్‌ కు బదులు ఆధార్ నెంబర్ ఇవ్వడంతో పాటు ఆధార్ నెంబర్ తప్పు చెబితే రూ.10,000 పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సాధారణంగా పాన్ నెంబర్ తప్పుగా చెబితే లేదంటే, ఒకటి కన్నా ఎక్కువ పాన్ నెంబర్లు కలిగి ఉంటే రూ.10 వేల జరిమానా ఖచ్చితంగా ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం మాత్రమే కాకుండా పాన్ కచ్చితంగా ఇవ్వాల్సిన స్థానాలలో ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఈ పెనాల్టీ రూల్స్ వర్తిస్తాయి. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్ తెరవడం, మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్టెమెంట్, రూ.50 వేలకు పైన లావాదేవీలకు పాన్ బదులు ఆధార్ ఇచ్చినప్పుడు, ఆ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అప్పుడు రూ.10 వేల పెనాల్టీ చెలించాల్సి వస్తుంది.

గతంలో జరిమానా కేవలం పాన్ నెంబర్‌ కు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఆధార్, పాన్ ఇంటర్‌ ఛేంజబిలిటీ అమలులోకి రావడంతో ఇప్పుడు ఈ రూ.10000 ఫైన్ ఆధార్ కార్డుకు కూడా వర్తిస్తుంది. మీరు ఎన్ని సార్లు ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తారో అన్ని సార్లూ మీకు ఫైన్ పడుతుంది. అంటే ఆధార్ నెంబర్ రెండు ఫామ్స్‌లో తప్పుగా వేస్తే, అప్పుడు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది మీరు. ఇకపోతే యూఐడీఏఐ కాకుండా ఈ జరిమానాను ఇన్‌ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :