Tuesday, December 10, 2019

Snacks allowed now in theatres



Read also:

థియేటర్లలోకి స్నాక్స్‌, వాటర్‌ బాటిళ్లు తీసుకెళ్లొచ్చు

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలోకి స్నాక్స్‌, వాటర్‌ బాటిళ్లు అనుమతించాల్సిందే.. ప్రేక్షకుల కోసం స్వచ్ఛమైన తాగునీరూ ఉచితంగా అందుబాటులో ఉంచాల్సిందే'' ఇది ఓ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ఇచ్చిన సమాధానం. సినిమా హాల్‌లోకి టిఫిన్‌ బాక్సులు, తినుబండారాలు, వాటర్‌ బాటిళ్లను ఎందుకు అనుమతించరు? అని ఆర్టీఐ కార్యకర్త విజయ్‌గోపాల్‌ దరఖాస్తు ద్వారా అడిగిన ప్రశ్నలకు పోలీసు శాఖ బదులిచ్చింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆహార పదార్థాలు, టిఫిన్‌ బాక్సులను థియేటర్లు అనుమతించడం లేదని పేర్కొంది.
అయితే వాటర్‌ బాటిళ్లను తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. సినిమా హాల్‌ లోపల స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత థియేటర్లపై ఉందన్నారు. 3డీ సినిమాలు చూసే కళ్లద్దాలు థియేటర్లలోనే తీసుకోవాలన్న నిబంధనేదీ లేదని, ప్రేక్షకులు ఇంటి నుంచి తెచ్చుకున్నా అనుమతించాల్సిందేనని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే థియేటర్లపై లీగల్‌ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :